చంద్రబాబునాయుడును విజయవాడ ఎంపీ కేశినేని నాని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారనే ముసుగులో పార్టీ పరువుతో పాటు అధినేత పరువును కూడా బజారుకు ఈడ్చేస్తున్నారు. పైగా చంద్రబాబుకు సూచనల్లాంటి వార్నింగులను బహిరంగంగానే ఇచ్చేస్తున్నారు. అయినా ఎంపీపై చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇపుడు సమస్య ఎలా తయారైందంటే ఎంపీపై యాక్షన్ తీసుకుంటే ఒక సమస్య తీసుకోకపోతే మరో సమస్యగా తయారైపోయింది.





స్వతహాగానే చంద్రబాబు ఎవరిపైనా యాక్షన్ తీసుకోలేని పిరికివ్యక్తి కాబట్టే ఎంపీ ఏమి మాట్లాడినా చెల్లుబాటైపోతోంది. ఈ ముసుగులోనే సూచనో లేకపోతే వార్నింగో తెలీని పద్దతిలో ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇపుడీ కామెంట్లు పార్టీ నేతల్లోనే కాకుండా మామూలు జనాల్లో కూడా వైరల్ అయిపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో తన తమ్ముడు కేశినేని చిన్నీకి ఎంపీ టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని వార్నింగ్ ఇచ్చారు.






నిజానికి ఎక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పూర్తిగా అధినేత ఇష్టమే. కానీ ఇక్కడ ఎంపీ మాత్రం తన తమ్ముడికి టికెట్ ఇచ్చేందుకు లేదని సీరియస్ గా నే వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తన సోదరుడికి చంద్రబాబు టికెట్ ఇస్తే తాను పనిచేయనని కూడా చెప్పేశారు. అలాగే తమ్ముడితో పాటు మరో ముగ్గురికి కూడా టికెట్లు ఇచ్చేందుకు లేదని నాని బెదిరించటమే విచిత్రంగా ఉంది. నానీకి బుద్ధావెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, నాగూల్ మీరాతో పాటు మాజీమంత్రి దేవినేని ఉమాతో కూడా ఏమాత్రం పడదు.






అయితే కేశినేని చిన్నీతో పాటు మరో ముగ్గురికి టికెట్లిచ్చేందుకు లేదన్నారంటే మరి పై నలుగురిలో ముగ్గురెవరో అర్ధంకావటంలేదు. నాగూల్ మీరాకు పోటీచేసేంత సీన్ లేదుకాబట్టి కచ్చితంగా బుద్ధా వెంకన్న, బోండా, దేవినేనే అయ్యుంటారని పార్టీలో టాక్ నడుస్తోంది. అసలు వీళ్ళకు టికెట్లివ్వద్దని ఏ అధికారంతో నానీ చంద్రబాబుకు వార్నింగిచ్చారో అర్ధంకావటంలేదు. మొత్తానికి మొగ్గలోనే తుంచేయాల్సిన అసమ్మతిని చంద్రబాబు చేతులారా ఇంతదాకా తెచ్చుకున్నారు. మరి ఎంపీ వార్నింగుల నేపధ్యంలో చంద్రబాబు రియాక్షన్ ఏమిటో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: