ఆంధ్రా జనాలను కెలకటం తెలంగాణా మంత్రులకు బాగా ఇష్టంలాగుంది. తాజాగా హరీష్ రావు వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒకవైపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఏపీలోని 175 నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీయార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మరచిపోయి హరీష్ నోటికొచ్చింది మాట్లాడుతు ఏపీని బాగా కించపరుస్తున్నారు. తెలంగాణా బ్రహ్మాండమని చెప్పుకోవాలంటే ఏపీని కించపరచాల్సిన అవసరం లేదని హరీష్ కు తెలీదా ? కానీ హరీష్ మాత్రం తానేమీ తప్పు మాట్లాడలేదని ఉన్నమాటే కదా మాట్లాడుతున్నదని పదేపదే రిపీట్ చేస్తున్నారు.





విషయం ఏమిటంటే సిద్ధిపేటలో బిల్డింగ్ మేస్త్రీల సంఘం భవనానికి శంకుస్ధాపన జరిగింది. ఆ సమయంలో కొందరు తాము తెలంగాణాలోనే ఓట్లు రాయించుకున్నామని ఇక్కడే ఉండిపోతామని చెప్పారట. దానికి హరీష్ బదులిస్తు తెలంగాణాలోనే ఉండిపోయేట్లయితే ఏపీలో ఓట్లు తీయించేసుకోమని చెప్పారట. రెండుచోట్ల ఓట్లెందుకన్న ఉద్దేశ్యంలో హరీష్ పై మాట చెప్పారట. ఇంతవరకు హరీష్ చెప్పింది కరెక్టే. కానీ ఆ తర్వాత మాట్లాడిందే ఓవర్ యాక్షన్ లాగుంది.





అభివృద్ధిలోను, పాలనలోను తెలంగాణాకు ఏపీకి ఆకాశం-భూమికి ఉన్నంత వ్యత్యాసముందని హరీష్ చెప్పింది ముమ్మాటికి ఓవర్ యాక్షనే. ఇలాంటి మాటలు ఇంకా చాలానే మాట్లాడారు. దానికి ఏపీ మంత్రుల నుండి కంటర్లు రాగానే తాను ఏమి తప్పు మాట్లాడానంటు సమర్ధించుకుంటున్నారు. తాను తప్పేమీ మాట్లాడలేదని, ఏపీ మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటు ఎదరుదాడి మొదలుపెట్టారు. సరే ఇష్యూ అయిపోయిందని అనుకుంటే తాజాగా పవన్ కల్యాణ్ వీడియో రిలీజ్ చేసి అందులో హరీష్ కు మద్దతుగా మాట్లాడారు. దాంతో హరీష్ మళ్ళీ ఏపీ మంత్రులపై నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.  





అసలు ఏపీ విషయాలను హరీష్ ఎందుకు ప్రస్తావించాలన్నదే ఏపీ మంత్రుల వాదన. ఎందుకంటే తెలంగాణా పాలనగురించి ఏపీ మంత్రులెవరూ మాట్లాడటంలేదు. కేసీయార్ పాలనా వైఫల్యాలపై ఏపీ మంత్రులెక్కడా ప్రస్తావించలేదు. అలాంటపుడు  ఏపీ మంత్రులను  హరీష్ కెలకటం ఎందుకు ? వడ్డించిన విస్తరిలాంటి హైదరాబాద్ ను వదిలేస్తే తెలంగాణా డెవలప్మెంట్ ఏమిటో బయటపడుతుంది. హైదరాబాద్ లేకపోతే తెలంగాణా ఎలాగుండేదో ఎవరికి వాళ్ళే ఊహించుకోవచ్చు. వర్షాలు వచ్చినపుడు నగరం పరిస్ధితి ఏమిటో ప్రపంచానికంతా తెలుసు. తమలో కూడా ఇన్ని లొసుగులు పెట్టుకుని ఏపీని కించపరచటం హరీష్ కు అవసరమా ?



మరింత సమాచారం తెలుసుకోండి: