రాజకీయాల్లో వారసుల ఎంట్రీ మన దేశంలో అనాదిగా వస్తున్నదే.. చాలామంది రాజకీయ నాయకులూ తమ వారసులను తమ తర్వాత రాజకీయాల్లో శాశించాలని కోరుకుంటుంటారు.. కుటుంబ రాజకీయాలకు పెద్ద పీట వేసే దేశమైన ఇక్కడ అదే రాజకీయ వారసుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ పరిస్థితి తీవ్రత ఎక్కువైందని చెప్పాలి.. అన్ని నియోజక వర్గాల్లో ని కీలక నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి దించి ఎమ్మెల్యేలు గా చేయాలనుకున్నవారే. కానీ ఉన్న ఒక్క సీటు ఎవరికీ ఇవ్వాలో తెలియక అధిష్టానం తలమునకలు అవుతుంది..