ఏపీ లో కరోనా విషయంలో ఉన్న గందరగోళం గతంలో ఏ విషయంలో ఏ పార్టీ లోనూ లేదు. అధికార వైసీపీ పార్టీ కూడా దీనిపై ఓ అవగాహన కు రాలేకపోతుంది. ఓ వైపు కరోనా వల్ల ప్రజలకు ఇబ్బంది అని చెప్తూ ఎన్నికలు వాయిదా వేయమంటుంది, మళ్ళీ మరోవైపు స్కూల్ ఓపెన్ చేస్తుంది.. దీనిపై ప్రజలు వైసీపీ తీరుపై ఎలాంటి ఆలోచనకు రాలేకపోతుంది. ప్రతిపక్షాలు కూడా ఇలానే రెండు ధోరణులను అవలంభించి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది.. మార్చిలో కరోనా కేసులు ఏపీలో సింగిల్ డిజిట్ లో ఉంటే వామ్మో అన్న తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల వాయిదాను ఆనాడు గట్టిగా సమర్ధించింది. ఇక ఇపుడు రోజుకు మూడు వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి.