ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ కోలుకోవాలంటే త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక గెలవడం తప్పనిసరి అయ్యింది.. ఇక్కడ గెలవకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఇప్పటికే ప్రజల్లో వీక్ అయిపోయి టీడీపీ ఆల్మోస్ట్ పతనం అయ్యే స్థాయికి వెళ్ళిపోయింది. దీని నుంచి బయటపడి బలమైన వైసీపీ ని ఎదుర్కోవాలంటే తిరుపతి లో గెలుపు చాలా కీలకం. పైగా చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఇది అయన పరువు సమస్య కూడా అయ్యింది. జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని నిరుపించాలన్నా, తమపై ఇంకా ప్రజలకు నమ్మకం పోలేదని చూపించుకోవలన్నా ఈ ఉప ఎన్నిక అన్నిటికి వేదిక కానుంది..