అయోధ్య అంటేనే వెంటనే టెన్షన్ అన్న మాట కూడా గుర్తుకువచ్చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం అయోధ్య లో చోటు చేసుకున్న పరిణామాలు, నాటి నుంచి అయోధ్య చుట్టూనే తిరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ ఒక్కసారిగా కమ్ముకుంటాయి. అయోధ్య ఫైజాబాద్ జిల్లాలో ఉంది. అక్కడ రాముల వారి కోవెల ఉంది. దాని పునర్నిర్మాణం కోసం  హిందూ సంస్థలు పోరాటం చేస్తున్న సంగతి విధితమే. మరో వైపు 1992లో కూలిపోయిన బాబ్రీ కట్టడాన్ని నిర్మించాలని ముస్లిం సంస్థలు కొన్ని పట్టుపడుతున్నాయి.


దాదాపుగా డెబ్బయ్యేళ్ళ‌కు పై చిలుకుగా  ఈ వివాదం ఉంది. అంతకు ముందు చరిత్రలో ఈ వివాదం ఉంది. అంటే వందల ఏళ్ళ క్రితం బాబర్ ఇక్కడ రాముల వారి ఆలయం కూల్చాడని చెబుతున్నారు.  అక్కడ బాబర్ సమాధిని నిర్మించారని కూడా పేర్కొంటారు. ఇవన్నీ పక్కన పెడితే అయోధ్య‌ విషయంలో 2010 లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పి అక్కడ ఉన్న రెండున్నర ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేసి మూడు ప్రధాన సంస్థలు పంచుకోమని చెప్పింది.


దాని మీద సుప్రీం కోర్టు  పిటిషన్ దారులు తలుపు తట్టారు. తొమ్మిదేళ్ళుగా ఈ కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఏకంగా ఇటీవల  47 రోజుల పాటు ఇటీవల ఏకబిగిన అయొధ్యపైన వాదనలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ధర్మాసనం విన్నది. ఇక తీర్పు రిజర్వ్ చేశారు. వచ్చే వారమే ఈ తీర్పు రానుంది. దీంతో ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం ఈ తీర్పు అన్నది చర్చగా ఉంది. దాంతో ఇపుదు అయోధ్య అంతటా టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. రంగంలోకి కేంద్ర హోం శాఖ దిగిపోయింది. అదే విధంగా  అయోధ్యతో పాటు యూపీ అంతటా కీలమైన సున్నిత ప్రాంతాలకు కేంద్ర బలగాలు వచ్చేస్తున్నాయి


ఇక భద్రతాదళాలా ఆధీనంలోకి మొత్తం ఉత్తర ప్రదేశ్ వెళ్ళిపోయింది. అంతా సహనం పాటించాలని కూడా పాలకులు కోరుతున్నారు. తీర్పు ఎలా వచ్చినా కూడా ఎవరూ స్పందించకూడద‌ని కూడా ఆదేశాలు వస్తున్నాయి. ఇక అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా తమ నేతలకు నోరు జారవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాపైన కూడా ఒక కన్ను వేశారు. మరి అయోధ్య తీర్పు వస్తోంది. ఏం జరుగుతుందో. ఈ నవంబర్ చరిత్రలో ఏ విధంగా మిగులుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: