ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా పేరుగాంచిన విజయవాడలో దేవినేని, వంగవీటి కుటుంబాలకు ఏ మాత్రం పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. వీరి కుటుంబాలు ఉప్పు-నిప్పులా ఉంటాయి. అలాగే వీరు కుటుంబాల రాజకీయ నేపథ్యం కూడా పూర్తి అపోజిట్ గానే ఉంటుంది. అయితే మొన్న ఎన్నికల్లో మాత్రం వీరు తొలిసారి ఒకే పార్టీలోకి వచ్చారు. దేవినేని నెహ్రూ, తన తనయుడుతో కలిసి 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ని వీడి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. 
ఈ క్రమంలోనే నెహ్రూ అనారోగ్య కారణాలతో కన్ను మూస్తే అవినాష్ టీడీపీలో మంచి నాయకుడుగా ఎదుగుతూ వచ్చాడు. ఇక ఎన్నికల ముందు వంగవీటి రాధా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వచ్చేశారు.


దీంతో ఇద్దరు ఒకే పార్టీలో రాజకీయం చేయాల్సిన పరిస్తితి వచ్చింది. ఎన్నికల్లో రాధా ఎక్కడా పోటీ చేయకుండా టీడీపీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేస్తే, అవినాష్ గుడివాడలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు రాష్ట్రంలో కూడా టీడీపీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఓడిపోయినా అవినాష్ పార్టీలో యాక్టివ్ గానే ఉంటే, రాధా మాత్రం సైలెంట్ అయిపోయారు. అసలు పార్టీతో సంబంధం లేనట్లుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ టీడీపీలోని కొందరు నేతలతో ఇబ్బందులు పడలేక, విజయవాడ తూర్పు సీటు కోసమని చెప్పి తాజాగా వైసీపీలోకి జంప్ అయ్యారు.

అయితే అవినాష్ వైసీపీలోకి వెళ్లడంతో మళ్ళీ ఈ రెండు ఫ్యామిలీలు రాజకీయ ప్రత్యర్ధులగా మారిపోయారు. కాకపోతే రాధా టీడీపీలో ఉండటం కష్టమే. అలా అని వైసీపీలోకి వెళ్లతారా? అంటే చెప్పలేం. ఎందుకంటే ఎన్నికల ముందు రాధా జగన్ పై ఎలాంటి విమర్శలు చేశారో అందరికి తెలుసు. అలాంటి అతన్ని జగన్ మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారా? అంటే కష్టమే. రాధా ఈ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు. ఇక అయితే గియితే రాధా జనసేనలో అన్న చేరాలి లేదా బీజేపీలోకి అన్న వెళ్ళాలి. చూడాలి మరి రాధా ప్రయాణం ఎటు ఉంటుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: