ఏపీలోని అధికార వైసీపీపై ఎన్ని విమర్శలు చేసిన ప్రజలకు చేరువకాలేకపోతున్నారో? లేదా బీజేపీకి దగ్గరవ్వాలనే ఆలోచనో తెలియదు గానీ ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు మత రాజకీయాలు చేయడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. సీఎం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై విమర్శలు చేస్తున్న బాబు...తాజాగా జగన్ కు మతం మరక అంటించాలని చూస్తున్నారు. సాధారణంగా హిందూ పార్టీ ముద్రవేసుకున్న బీజేపీ అదే పని చేసుద్ది. కానీ ఆ బీజేపీకే దగ్గరవ్వడానికి బాబు మతం కార్డుని వాడుతున్నారు.

 

ఇటీవల బాబు గానీ టీడీపీ నేతల మాటల్లో గానీ ఎక్కువ ఈ మతం గురించే వస్తుంది. టీటీడీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, రోడ్డు విస్తరణలో భాగంగా ఓ ఆలయం కూల్చివేత, తిరుపతి లడ్డు ధరం పెంపు, జగన్ శ్రీవారిని దర్శించుకునేప్పుడు డిక్లేరేషన్ ఇవ్వాలని, జెరుసలెం, హజ్ యాత్రలకు వెళ్ళే క్రిస్టియన్, ముస్లింలకు సాయం పెంచడం, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ఆంగ్లో ఇండియన్ టీచర్స్‌ను తీసుకొచ్చి వారిద్వారా మతప్రచారంకు తెరతీసే యోచన చేస్తున్నారని...ఈ విధంగా ప్రతి విషయాన్ని బాబు అండ్ కొ జగన్ కు మతం రంగు పూయాలని చూస్తున్నారు.

 

కేవలం బీజేపీకి దగ్గరవ్వడానికే టీడీపీ ఇదంతా చేస్తుందని తాజాగా ఓ జాతీయ పత్రిక కథనం కూడా ప్రచురించింది. అందుకే బీజేపీ కంటే టీడీపీనే మతాన్ని భుజాన్ని వేసుకుని రాజకీయం చేస్తుందని పేర్కొంది. ఎన్నికల్లో ఎలాగో బీజేపీకు దూరమయ్యి నష్టపోయిన టీడీపీ ఇప్పుడు బీజేపీకి ఇలా దగ్గరయ్యేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోంది. పైగా జగన్ ని కేంద్రం పెద్దల నుంచి కూడా దూరం చేయడానికి వ్యూహాలు రచిస్తోంది.

 

అందులో భాగంగానే ఇప్పటి వరకు సెక్యులర్ పార్టీగా ముద్రవేసుకున్న టీడీపీ మెల్లగా స్వరం మారుస్తూ హిందూత్వ అజెండాను తీసుకుంటుంది. ఇక ఎన్నిక‌ల‌కు ముందు కుల రాజ‌కీయాలు చేసి అట్ట‌ర్ ప్లాప్ అయిన బాబు ఇప్పుడు ఈ మత రాజకీయాల్లో ఏమ‌వుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: