వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరస పధకాలు, అభివృద్ధితో దూసుకుపోతున్నాడు.  దేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకోవడం వెనుక అయన కృషి మరవాలేదని.  మూడు రాజధానుల అంశం తరువాత జగన్ ను అందరు ఆడిపోసుకున్నారు.  కానీ, జగన్ అవేమి పట్టించుకోలేదు.  అంతేకాదు, అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు.  విశాఖకు జనవరి 20 తరువాత సెక్రటేరియట్ లోని కొన్ని విభాగాలు అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

 
ఈ ఏర్పాట్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  విశాఖకు అనేక వరాలు ప్రకటించారు.  ఇప్పటికే మెట్రో రైల్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.  అయితే, ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ట్రామ్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది.  ఈ చర్చలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.  వీటితో పాటుగా జగన్ రాష్ట్రంలోని కొన్ని ముఖ్యప్రాంతాలపై కూడా దృష్టి పెట్టారు.

 
రాష్ట్రంలోని మంగళగిరి, తాడేపల్లి, పులివెందుల మున్సిపాలిటీల కోసం ప్రత్యేక అధికారిని నియమించి అభివృద్ధి చేయబోతున్నారు.  అలానే విశాఖలో నిరంతరం తాగునీటిని అందించాలని, పోలవరం నుంచి భూగర్భం పైపులైనుల ద్వారా నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.  అదే విధంగా విశాఖలో 1.5 లక్షల పట్టాలు ప్రజలకు పంపిణి చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధం అయ్యింది.  


ఇక చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నాయుడు నియోజక వర్గం కుప్పంపై కూడా జగన్ దృష్టి పెట్టారు.  కుప్పం నియోజక వర్గం నుంచి బాబు ప్రతినిత్యం వహిస్తున్నా ఇప్పటి వరకు పెద్దగా డెవలప్ కాలేదు.  కనీసం మున్సిపాలిటీగా కూడా కనీసం జగన్ మార్చుకోలేకపోయారు.  ఇప్పుడు జగన్ మున్సిపాలిటీగా కుప్పంను మార్చేందుకు అంగీకారం తెలిపారు.  దీంతో కుప్పం ప్రజలు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  జగన్ కుప్పంపై దృష్టిపెట్టడంతో బాబులో భయం మొదలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: