విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ప్రకటించడమే కాకుండా నిన్న అసెంబ్లీలో బిల్లు సైతం పాస్ చేయడంతో విశాఖలో కొత్త సచివాలయం ఏర్పాటు అధికారులు భవనాల వేటలో పడ్డారు. సముద్ర తీరం సమీపంలో ఉన్న మిలీనియం టవర్స్ లోని రెండు ప్రధాన బిల్డింగులను, పక్కనే ఉన్న మరో భవనాన్ని సచివాలయం కోసం అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం విశాఖ లో ఉన్న మిలీనియం టవర్స్ లోని రెండు భవనాల్లో 1.5 లక్షల చదరపు అడుగులు చొప్పున వసతి అందుబాటులో ఉంది. ఈ భవనంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 


విద్యుత్ సౌకర్యాలతో పాటు నేరుగా కంప్యూటర్లను ఏర్పాటు చేసుకొని పని చేసుకోవడమేనని అధికారులు చెబుతున్నారు. ఇక రెండో బిల్డింగ్ లోనూ విద్యుత్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉన్నాయని, చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని, ఒక నెలరోజుల్లో పూర్తిస్థాయిలో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని, అలాగే రెండో భవనంలోనూ విద్యుత్ కు సంబంధించి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. మిలీనియం టవర్స్ పక్కనే ఉన్న మరో భవనం యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణం సామర్థ్యంతో భవనం అందుబాటులో ఉందని చెబుతున్నారు.


ఇక సమాచార, సాంకేతిక శాఖ అధికారులు భవనాలను ఏవిధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనే దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా మిలీనియం టవర్ను సచివాలయం కోసం వినియోగించుకుంటే సరిపోతుందని, అలాగే శాఖాధిపతుల కార్యాలయాలకు మరో భవనం వాడుకుంటే బాగుంటుందని నిర్ధారణకు వచ్చారు. ఇక మిగిలిన 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల మరో భవనం ఎవరికైనా వసతి కల్పిస్తే  బాగుంటుందని అధికారులు చెబుతున్నారు.


రాజధాని తరలింపు పై స్పష్టమైన ప్రకటన వచ్చిన నేపథ్యంలో శాఖల ఉన్నతాధికారులు మరోసారి విశాఖను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. విద్యుత్, ఉద్యోగులు, ఉన్నతాధికారులకు సంబందించిన అన్ని వసతి సౌకర్యాల గురించి అధికారులు చర్చిస్తున్నారు. ఎన్ని అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి అనే విషయంపై ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. ఈ నెల 27వ తేదీన కొన్ని విభాగాలను విశాఖకు తరలించ బోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మొత్తం తరలింపు చర్యలు పూర్తి అయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: