ఎన్ని ప్రశంసలు వచ్చినా ..ఎన్ని విమర్శలు వచ్చినా, తాను అనుకున్నది చేసి చూపించడంతో పాటు ఇప్పటి నుంచే వచ్చే నాలుగేళ్లలో చేయబోయే అన్ని కార్యక్రమాల గురించి జగన్ ఒక ప్రణాళిక ప్రకారం అన్ని సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి తన మార్క్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూపించేందుకు జగన్ ప్రయత్నించాడు. అనుకున్నట్లుగానే ఆ విషయంలో సక్సెస్ అవడంతో పాటు తమ రాజకీయ ప్రత్యర్ధులు నోరెళ్ళబెట్టే స్థాయిలో జగన్ పరిపాలన గ్రామస్థాయి నుంచి మొదలైంది. గ్రామ సచివాలయ ఏర్పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, మహిళల భద్రత, అవినీతి రహిత పాలన, దిశా చట్టం ఇలా అన్ని విషయాల్లోనూ జగన్ తీసుకువచ్చిన మార్పులు సక్సెస్ గా  అమలవుతున్నాయి. 

 

IHG


వీటితో పాటు నాడు నేడు పేరుతో విద్యార్థుల భవిత, ప్రభుత్వ స్కూళ్ల  భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలి ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తొమ్మిది నెలల పాలన ప్రజా రంజకంగా సాగింది. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ కూడా లబ్ధిదారులు, గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే తీసుకువెళ్లి అందిస్తున్నారు ఇది నిజంగా ఒక సంచలనం నిర్ణయమే. రాజకీయ ప్రత్యర్థులు కూడా నోరుమెదపని కార్యక్రమం. ఇవే కాకుండా వచ్చే మూడేళ్లలో భూముల రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయంలో నిర్వహించేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. 


ఇక గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ల పేరుతో ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విలేజ్ క్లినిక్ లో 24 గంటలు వైద్యం అందించే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ ఒడి ఇవన్నీసమర్ధవంతంగా అమలు చేసి చూపిస్తున్నాడు. అయితే రాబోయే రోజుల్లో ఈ పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ఆదాయం పెంచుకునే మార్గాలపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడం, ప్రజల ఆదాయ మార్గాలను కూడా పెంచే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: