ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది ఆటగాళ్లు అంటూ ఉంటారు.. ఒకప్పటి ఆట తీరు  ఇప్పటి ఆట తీరు ఎంతో తేడా ఉందని... కొంతమంది ఒకప్పటి ఆటగాళ్లు ఎంతో ప్రతిభ గలవారు అని అంటుంటే... కొంతమంది నేటితరం ఆటగాళ్ళు ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారు అని చెబుతూ ఉంటారు. అయితే క్రికెట్ మొదలైనప్పటి నుంచి కొంత మంది ఎన్నో రికార్డులు సృష్టించిన వారు క్రికెట్ దిగ్గజాలు గా పేరుగాంచిన ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.. ఇలా క్రికెటర్లలో  భారత యువ క్రికెటర్లు అందరికీ  స్ఫూర్తిగా నిలిచిన  క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో ఇన్నింగ్స్ ఆడారు. 

 

 

 భారత జట్టులో కీలక బ్యాట్ మెన్ గా కొనసాగుతూ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తో ఎన్నో మ్యాచ్ లను  విజయతీరాలకు చేర్పించాడు సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ సృష్టించిన రికార్డులు ఆడిన ఇన్నింగ్స్  ఇప్పటికీ ఎంతో మంది ఆటగాళ్లకు స్పూర్తిదాయకమే. అయితే క్రికెట్ లో ఎన్ని ఫార్మాట్ లు  వచ్చిన టెస్ట్ క్రికెట్ కి ఒక ప్రత్యేకత ఉంటుందిఅన్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో ఆటగాడి నైపుణ్యత ఏమిటి అనేది పూర్తిగా బయటపడి పోతుంది. అందుకే ముందుగా అందరూ టెస్ట్ క్రికెట్ ఆడిన తర్వాత వన్డే మ్యాచ్లో ఆడుతూ ఉంటారు. అయితే టెస్ట్ క్రికెట్ లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కి ఒక అరుదైన రికార్డు ఉంది. 

 

 

 అదేంటి అంటే... టెస్ట్ క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు అద్భుతంగా రాణించారు సునీల్ గవాస్కర్. టెస్ట్ క్రికెట్లో 10000 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా సునీల్ గవాస్కర్ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే సునీల్  గవాస్కర్  10000 రన్స్  చేసింది ఈ రోజు. ఇక ఈ ఘనత సాధించింది కూడా భారత దాయాది దేశమైన పాకిస్థాన్ తో ఆడిన టెస్ట్ మ్యాచ్లో. దీంతో ఈ అరుదైన రికార్డు భారత క్రికెట్ చరిత్రలో మరింత అరుదుగా మారిపోయింది. 1987 మార్చి 7న పాకిస్థాన్ తో  జరిగిన టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో  63 పరుగులు చేసి పదివేల మార్కును... దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేరుకున్నాడు. ఇంకో విషయం ఏమిటి అంటే... 1877 లో మొదలైన టెస్ట్ క్రికెట్లో 10000 రన్స్ రికార్డును చేరుకోవడానికి ఏకంగా 110 ఏళ్లు పట్టింది. 110 ఏళ్ల తర్వాత సునీల్ గవాస్కర్ రికార్డును సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: