ఏపీలోని పొలిటికల్ లీడర్లలో మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబు తరవాతే ఎవరైనా అని చెబుతారు. ప్రెస్ ను ఆయన అద్భుతంగా మేనేజ్ చేస్తారని చెబుతారు. అందుకే ఆయనకు సొంత మీడియా అంటూ లేకపోయినా.. అధికారంలో లేకపోయినా మీడియాలో మాత్రం ఎప్పుడూ కనిపిస్తుంటారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలు.. కనీసం 3,4 ఛానళ్లు ఆసాంతం లైవ్ టెలికాస్ట్ చేసి తరిస్తుంటాయి.

 

 

అలాంటి టీడీపీ ఇప్పుడు ఓ ఛానల్ ను బహిష్కరించాలని భావిస్తోందట. టీడీపీ ఇప్పటికే సాక్షి మీడియాను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ టీవీ9 ఛానల్ ను కూడా బహిష్కరించే యోచనలో ఉందట. ఎందుకంటే.. టీవీ9 ఛానల్ ఇప్పుడు పూర్తిగా టీడీపీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందట. సాక్షి మీడియాకు నకలుగా మారిపోయిందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. లైవ్ కవరేజీల విషయంలోనే కాదు. వ్యతిరేక కథనాలు వండివార్చడంలో సాక్షికి పోటీ వస్తున్నారట.

 

 

ఇలా ఎందుకు జరిగిందంటే.. టీవీ9 యాజమాన్యం ఇటీవల మారిన సంగతి తెలిసిందే. ఈ కొత్త మేనేజ్ మెంట్ కు టీడీపీ పై పెద్దగా సానుభూతి ఏమీ లేదు. పైగా.. జగన్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయట. అందుకే ఆ ఛానల్ పూర్తిగా టీడీపీ వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల టీవీ9 ఛానల్లో వచ్చే కథనాల్లో టీడీపీ పట్ల పదజాలం కూడా చాలా తీవ్రంగా ఉంటోందట.

 

 

అందుకే సాక్షి మీడియాను వెలేసినట్టు టీవీ9 ను కూడా బహిష్కరించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ సర్కార్‌ను పొగుడుకుంటే తమకేం ఇబ్బంది లేదు కానీ.. తమపై కావాలని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఫీలవుతున్నారట. టీవీ9 రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని తప్పుడు వార్తలు ప్రసారం చేసే స్థాయికి టీవీ9 దిగజారిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: