కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మూడు అక్షరాల పదం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు తీసింది. మన ఇండియాలో ఇప్పటి వరకూ ముగ్గురు చనిపోయారు. వందల మందికి కరోనా వచ్చింది. విదేశాల్లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అయినా సరే ఈ కరోనా చాలా మంచిది అంటున్నారు కొందరు నెటిజన్లు.

 

 

వారు పెట్టే పోస్టులు చూస్తే ఇదీ నిజమే అనిపిస్తోంది. కరోనాకు మరో కోణం ఇది అనిపించక మానదు. వారు ఏమంటారంటే..

 

కరోనా మంచిదే!

ఔనండీ మీరు చదివింది నిజమే!

నా దృష్టిలో కరోనా మంచిదే!

 

భ్రష్టు పట్టిన వ్యవస్థ లో మార్పు కరోనా తోనే సాధ్యం!

అదుపు తప్పిన విచ్చల విడి సమాజాన్ని గాడి లో పెట్టాలంటే కరోనా రావాలి!

 

కరోనా! నో షేక్ హాండ్!

సంస్కారంతో కూడిన నమస్కారం నేర్పింది!

 

నిజమో కాదో తెలీదు చైనీయులు జంతువులు కీటకాలు తింటున్న వీడియోలు చూసిన మన వాళ్లు వాంతులు చేసుకొని నాన్ వెజ్ జోలికే వెళ్లడం లేదు!

 

కరోనా సంగతి తెలీదు గానీ చేతులు శుభ్రంగా కడుక్కోండ్రా అంటే యూనిసెఫ్ చెప్పినా నవ్వి తీసి పారేసాం!

 

ఇపుడు చేతులు సబ్బులరిగేలా సానిటైజర్లు ఐపోయేలా కడగడంతో మిగిలిన రోగాలు ఆమడ దూరానికి వెళ్లి పోయాయి!

 

అనవసర తిరుగుళ్లు లేవ్! దుబారా ఖర్చుల్లేవ్!

హోళీ రోజు పసుపూ కుంకుమతో సున్నితంగా కానిచ్చాం!

హమ్మో లేదంటే గ్రీజు ఆయిలూ కోడిగుడ్లూ నానా ఛండాల మయ్యేది!

అల్లం వెల్లుల్లి శొంఠి మిరియాల గొప్పతనం తెలిసొచ్చింది!

మన చారు చైనా వాళ్లు తాగుతున్నారు!

పురుగుల మందు లాంటి కూల్ డ్రింకుల జోరు తగ్గింది!

AC లు మానేయడంతో కరెంటు బిల్లు జేబుకు చిల్లు పడ్డం లేదు!

రైళ్లలో బస్సుల్లో అనవసర ప్రయాణాలు తగ్గి పోవడంతో అవసరమైన వాల్లకి సీట్లు దొరుకుతున్నాయి! ఇంటి పట్టునే ఉండండం తో ఇంట్లో వాళ్లతో మాట్లాడ్డం పెరిగింది బంధాలు బల పడుతున్నాయి!

 

తాగే నీళ్ల నుండి వేసుకునే జోళ్ల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం!

ఏమౌతుందిలే అన్న తెంపరితనం కనుమరుగైంది!

అందుకే! కరోనా మంచిదే!! కరోనా కుఛ్ కర కే దిఖాయా!!

 

ఇదీ నెటిజన్లు చూపిస్తున్న రెండో కరోనా కోణం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: