మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.  ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పి బిజెపి గూటికి చేరడంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. ఇక జ్యోతిరాదిత్య సింధియా తో పాటు కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం లో సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలను  మళ్ళీ పార్టీలో చేర్చుకునేందుకు  ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. 

 

 

 మొదట బలపరీక్ష జరగకుండా అడ్డుకున్నప్పటికీ ఆ తర్వాత బీజేపీ పార్టీ  సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో బలపరీక్ష నిరూపించుకోక  తప్పలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన 22 మంది ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూడకపోవడంతో అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక  కమల్నాథ్ ఈ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏర్పడనుంది . ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్  చౌహాన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

 

 

 ఈ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే మొదట ఎన్నికలు జరిగిన అనంతరం ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ బీజేపీ మాత్రం పట్టు విడవకుండా ప్రయత్నం చేసింది. చివరికి ప్రయత్నంలో విజయం సాధించింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి.. కమల్ నాథ్  ప్రభుత్వంలో సంక్షోభం  ఏర్పడేలా చేసి... మధ్యప్రదేశ్ రాజకీయాలను  తమ వైపు తిప్పుకుని అధికారంలోకి వచ్చింది బిజెపి పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి: