దేశ వ్యాప్తంగా  రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారతదేశంలో మొట్టమొదటి కరోనా  కేసు నమోదయింది కేరళ రాష్ట్రంలో. అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉండాల్సింది కేరళ రాష్ట్రంలోనే . ఎందుకంటే  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కేవలం కేరళ కు  విదేశాల నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ కేసుల్లో మహారాష్ట్ర తో పోలిస్తే  కేరళ రాష్ట్రం చాలా తక్కువగా ఉంది. 300 కరోనా కేసుల  దగ్గరే ఆగిపోయింది కేరళ రాష్ట్రం. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి కేరళ రాష్ట్రం పైన పడింది. ప్రపంచ మహమ్మారిని అగ్రరాజ్యమైన అమెరికా సైతం కట్టడి చేయలేకపోయింది. భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు కరోనా  వైరస్ ను కట్టడి చేయలేకపోతున్న నేపథ్యంలో రోజు రోజుకు  కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

 

 ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో  8వ స్థానంలో ఉంది కేరళ రాష్ట్రం. దేశంలో మొట్టమొదటిసారిగా కరోనా  కేసు నమోదయింది కేరళలో రాష్ట్రంలో అయినప్పటికీ.. కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు  నమోదైన కేసులు 364 మాత్రమే. ఇద్దరు  మాత్రమే మృతిచెందారు . ఈ మహమ్మారి నుండి  కోలుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా వృద్ధులు సైతం ప్రపంచ మహమ్మారిని జయించి  మృత్యుంజయులవుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్  కట్టడి చేయడంలో కేరళ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఆశాకిరణంగా మారిపోతుంది. 

 


 మొట్ట మొదటి కరోనా వైరస్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదు అయినప్పటికీ నాటినుండే కరోనా  కట్టడి కోసం కేరళ ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్లాన్ రెడీ చేయడం కారణంగానే కేరళలో కరోనా  వైరస్ ను కట్టడి చేయ గలిగినట్లు తెలుస్తోంది. కేరళలో మొదటి కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన గంటల్లోనే అత్యవసర సమావేశం ఏర్పాటు...  ఎమర్జెన్సీ ప్రకటించడం.. వైరస్ నియంత్రణకు భారీ నిధులు విడుదల చేయడం... ప్రతి జిల్లాలో కరోనా  వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టడం లాంటి సత్వర చర్యలు చేపట్టడం కారణంగా కరోనా  వైరస్  కట్టడి  చేయగలిగింది కేరళ ప్రభుత్వం. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న భవనాలను కూడా క్వారంటైన్ రూమ్స్  చేసింది ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని  టెస్టులు కేరళ లో  చేశారు. విదేశాల నుంచి వెళ్లి వచ్చే వారిని తక్కువ సమయంలో గుర్తించి వారిని ఇంటికి  మాత్రమే పరిమితం చేశారు. మారజ్ కు వెళ్లి వచ్చిన వారు కూడా కేరళ రాష్ట్రం లో చాలామంది ఉన్నారు కానీ.. మార్కజ్ కు వెళ్లి  వచ్చిన వారిని గంటల్లోనే  గుర్తించి క్వారంటైన్ కి  తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి పకడ్బందీగా  పటిష్టంగా అమలు చేసింది  కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ రోజు వరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజల్లి  ధైర్యం నింపారు. బ్రేక్ ద చైన్ పేరిట ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బహిరంగ  ప్రదేశాల్లో కూడా సబ్బు నీళ్ళు వాష్ బేసిన్  లాంటి ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే గుర్తించి పకడ్బందీగా ప్లాన్ చేయడం వల్ల కేరళలో కరోనా కట్టడి  సమర్థవంతంగా చేయగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: