భారతదేశంలో కరోనా  వైరస్ పోరాటంలో భాగంగా పోలీసుల పాత్ర కీలకంగా మారిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ సోకితే ప్రాణాలకే ప్రమాదమని తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం ఎంతో ధైర్యంగా విధి నిర్వహణలో భాగంగా తన ప్రాణాల కంటే దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని భావించి కరోనా  వైరస్ పై  పోరాటం లో భాగం అవుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రాణాలను పణంగా పెట్టి మరి కరోనా పై పోరాటం చేస్తున్నారు. ఏకంగా కుటుంబాలకు దూరంగా ఉండి మరి పోరాటం లో నిమగ్నమై పోతున్నారు పోలీసులు.ఇక  ఇక్కడ ఉత్తరప్రదేశ్ కు  చెందిన ముగ్గురు పోలీసులు చేసిన పని పై  ప్రశంసల వర్షం కురిస్తుంది. తాము పెళ్లి చేసుకోవాల్సి ఉన్నప్పటికీ... వృత్తి ధర్మానికి కర్తవ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ..ముగ్గురు  పోలీసులు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 

 

 

ఇక ఈ విషయాన్ని యూపీ పోలీస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. అధికారులు సోషల్ మీడియా వేదికగా తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న దీపక్ సింగ్... ప్రజల ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా ఉండేందుకు. నిత్యావసరాలను అందించాలని యూపీ సర్కార్ సూచించిన నేపథ్యంలో ప్రజలందరికీ ఇంటింటికీ తిరుగుతూ నిత్యవసర వస్తువులను అందజేస్తున్నాడు . అయితే దీపక్ సింగ్ కు  మే 6 వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అయితే  ప్రస్తుతం విధి నిర్వహణలో నిమగ్నమైన దీపక్ సింగ్  ఇలాంటి సమయంలో.. ఉద్యోగానికి  విరామం ఇచ్చి పెళ్లి చేసుకోవడం సరైనది కాదు అని భావించి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. 

 

 

 ఇక సంచేది పోలీస్ స్టేషన్ లో  పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ రషీద్ అలీ  కూడా ఇలాంటి పని చేశాడు. అతనికి మే 30 తేదీన వివాహం నిశ్చయమైంది. ఇందుకోసం ముందుగానే అతను సెలవు  పెట్టుకున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం కరోనాపై  పోరాటానికి ఎప్పుడైతే లాక్ డౌన్ ప్రకటించిందో... విధి నిర్వహణ పై ఎంతగానో  నిబద్ధత ఉన్న సదరు కానిస్టేబుల్  తన సెలవులు సైతం రద్దు చేసుకున్నాడు. పెళ్లిని వాయిదా వేసుకుని విధి నిర్వహణలో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సదరు కానిస్టేబుల్. ఇక మరో మహిళ పోలీస్ అధికారి కూడా మార్చ్ 30న  లో జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకొని విధినిర్వహణలో నిమగ్నమై పోయి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె లాక్ డౌన్ సమయంలో పేదలందరికీ ఆహారం పంచె డ్యూటీ చేస్తుంది. ప్రస్తుతం ఈ ముగ్గురు పోలీసులు తీసుకున్న నిర్ణయంతో మీడియా వేదికగా అభినందనల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: