విరుగుడు తయారవుతుందా..? పరిశోధనలు ఫలించి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందా..? అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో గిలియడ్ సైన్సెస్ కంపెనీ ప్రయోగాలు చేపడుతోంది. తాజాగా ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. వ్యాక్సిన్‌ తయారీలో చాలా ముందున్నామని అంటోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏడాదిలోపే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. 

 

కరోనా వైరస్ అనే కంటికి కనిపించని శత్రువుతో ప్రస్తుతం ప్రపంచమంతా పోరాడుతోంది. ఎంతో అభివృద్ధి దేశాలు సైతం కోవిడ్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. అయితే అమెరికాలోని గిలియడ్ సైన్సెస్ తయారు చేసిన కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగిస్తున్నారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో రెమెడిసివిర్ ప్రభావ వంతంగా పనిచేసిందని తెలుస్తోంది. కరోనాతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి ఈ వార్త కాస్త ఊరటినిస్తోంది.

 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 800మంది కరోనా పేషెంట్లపై యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. దీనిని బాదితులపై ప్రయోగించినపుడు మంచి ఫలితాలు రాబట్టిందని సమాచారం. అయితే గిలియడ్ సైన్సెస్ బయోటెక్ కంపెనీ దీనిని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

 

వైరస్‌పై ప్రత్యక్షంగా పనిచేసే ఔషధాల వర్గానికి చెందిన రెమెడెసివిర్.. స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందనను నియంత్రించడానికి అసాధారణ సందర్భాల్లో దీనిని వాడతారు. ఇది RNA, dna నాలుగు బిల్డింగ్ బ్లాకులలో ఒకదానిని అనుకరించి, వైరస్ జన్యువులో మమైకవుతుంది. రోగకారక క్రిమి రూపాంతరం చెందకుండా ఆపుతుంది.

 

ఈ వ్యాక్సిన్ సురక్షితమని తెలినప్పటికీ... వైరస్‌పై సమర్థవంతంగా పని చేస్తుందని నిరూపితమైనప్పటికీ.. ఇది మార్కెట్లోకి రావడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశముంది. వైరస్‌లను అరికట్టడం కోసం పలు సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలోనే కరోనా వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సైంటిస్ట్‌లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: