మత్స్యకారుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో 8 ఫిషింగ్ హార్బర్లు, మరో ఫిష్ ల్యాండ్ నిర్మించాలని.. ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. వలసలను నిరోధించడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సీఎం జగన్ తెలిపారు. 

 

రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్లపై .. ఏపీ ప్రభుత్వం సమీక్ష జరిపింది. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం.. మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో 8 ఫిషింగ్ హార్బర్లు, మరో ఫిష్ ల్యాండ్‌ నిర్మించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తద్వారా  మత్స్యకారులు వలసలు నిరోధించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం.

 

రాష్ట్రంలోని  974 కిలోమీటర్ల విశాలమైన సముద్ర  తీర రేఖ ఉందనీ,  ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, జెట్టీలు నిర్మించడం ద్వారా ఉపాధితో పాటు ఆదాయం వస్తుందన్నారు సీఎం. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో జెట్టీలు నిర్మిస్తామన్నారు. పదకొండు వందల కోట్ల రూపాయలతో మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.కేంద్రం చేపట్టిన సాగర్ మాల పథకంలో భాగంగా వీటి నిర్మాణం చేపట్టనున్నారు.

 

శ్రీకాకుళం జిల్లా బుడగట్ల వారి పాలెంలో మేజర్ ఫిషింగ్ జెట్టి, విశాఖ పూడిమడక, పశ్చిమగోదావరి బియ్యపు తిప్పల, నెల్లూరు జిల్లా జువ్వాల పాలెంలను కూడా ఫిషింగ్ జెట్టీలుగా మారుస్తామన్నారు ఏపీ సీఎం. మొత్తం  3వేల కోట్ల రూపాయల వ్యయంతో... రెండున్నర ఏళ్ళలో ఈ ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేస్తామన్నారు సీఎం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నందున .. ఆర్ధికంగా కోట్ల రూపాయల మేర ఆదాయం ఆర్జించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి సీఎం తీసుకుంటున్న చర్యలు .. ప్రశంసనీయమన్నారు మంత్రి మోపిదేవి. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంతో .. రాష్ట్రానికి ఆదాయం రావడంతో పాటు మత్స్యకారులకు మహర్ధశ పట్టనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: