దేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు నమోదు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న  రాష్ట్రం ఏది అంటే.. అది కేరళ రాష్ట్రం అని స్పష్టంగా చెప్పవచ్చు. మొట్ట మొదటి కరోనా  వైరస్ కేసు నమోదయింది కేరళ రాష్ట్రంలోనే.  అయినప్పటికీ మొదటి కేసు నమోదు అయినప్పటి నుంచి ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా  వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంది కేరళ రాష్ట్రం. అందుకే అసలు  కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు కేసులు ఎక్కడ పెరగలేదు.అంతే కాదు భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు కూడా కేరళ రాష్ట్రం నుంచే ఎక్కువగా ఉంటారు. ఇక విదేశాలలో చదువుకునే వారు కూడా అక్కడి నుంచే ఎక్కువగా ఉంటారు.. అయినప్పటికీ కేరళ రాష్ట్రం మాత్రం కరోనా వైరస్ కట్టడిలో విజయం సాధించింది అని చెప్పవచ్చు. 

 

 

 క్రమక్రమంగా కేరళ రాష్ట్రంలో కరోనా  వైరస్ అనేది లేకుండా పోతుంది. ఇక గత కొద్దిరోజుల నుంచి కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య కేరళ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో తగ్గుముఖం పట్టాయి. కానీ మరోసారి అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మళ్లీ శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి  సంఖ్య కేరళ రాష్ట్రంలో క్రమక్రమంగా మళ్లీ పెరుగుతోంది. దీంతో ఇది ప్రభుత్వానికి సవాల్ లాగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. 

 

 

 

 మొన్నటి వరకు అసలు కేసుల జాడలేని కేరళ రాష్ట్రంలో కొత్తగా 7 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.  ఈ  కేసులకు సంబంధించిన విషయాన్ని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. వాయనాడ్ లో 3 కొత్త పాజిటివ్ కేసులు నమోదవగా... త్రిసూర్ లో రెండు కేసులు నమోదయ్యాయి.  ఎర్నాకులం,  మలంలో ఒక్కో కేసు నమోదైనట్లు గా అక్కడి అధికారులు వెల్లడించారు.  ఇక ఈ ఏడు కేసులతో మొత్తం రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన కేసుల సంఖ్య 512 చేరింది . కాగా ప్రస్తుతం 20 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉండగా నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: