తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే టెన్త్ ఎగ్జామ్స్‌ రద్దు చేసింది ప్రభుత్వం. అయితే ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డిగ్రీ ,ఇంజినీరింగ్, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలపైనా క్లారిటీ లేదు. ఏపీలో సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేయడంతో... తెలంగాణలోనూ రద్దు చేయాలన్న డిమాండ్‌ వస్తోంది. 

 

ఈ నెల 18న తెలంగాణ ఇంటర్ పలితాలు వెలువడ్డాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం ఫలితాలు ప్రకటించారు. ఇంటర్ ఫలితాలతో పాటే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించాలి. అయితే ఈ సారి కరోనా తీవ్రతతో పరీక్ష తేదీలను ప్రకటించలేదు. తర్వాత అధికారులు ప్రకటిస్తారని అన్నారు. అయితే ఫలితాలు ప్రకటించి వారం రోజులు అవుతున్నా... ఇంకా అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షల పై నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారు ఇంటర్ అధికారులు. 

 

ఏపీలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయడంతో...తెలంగాణలోనూ రద్దు చేయాలన్న డిమాండ్ వస్తోంది. పరీక్షలు రద్దు చేయాలని ఇటు ఇంటర్ విద్యా జేఏసీ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

 

ఇక డిగ్రీ, పీజీ... ఫైనల్ ఇయర్  ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుండి నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీలకు సూచించింది. ఐతే కరోన కేసులు పెరుగుతుండడం, ప్రభుత్వ జోక్యంతో పరీక్షలు ప్రారంభం కాలేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నత విద్యామండలి అధికారులు, ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు సమావేశం అయ్యి పరీక్షల పై చర్చించారు... పరీక్షల నిర్వహణ, రద్దు లాభ నష్టాల పై రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు...

 

సీఎం ఈ పరీక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో కరోన కేసులు భారీగా పెరుగుతుండడం, పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతుండడంతో సీఎం ఆ వైపునే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: