మాతృత్వపు మమకారం మాటలకు అందనిది. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. అమ్మ పాత్ర కుటుంబ వ్యవస్థలో అత్యంత కీలకం. అమ్మ చూపించే ప్రేమ, ఆప్యాయత ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ వెతికిన దొరకవు. సాక్షాత్తు మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడు సైతం ఒక అమ్మ కన్న బిడ్డే. బిడ్డ ఎదుగుదలలో ముందుండి నడిపించేది ఒక్క అమ్మ మాత్రమే. అలాంటి  అమ్మ కన్న  బిడ్డే మన దేశ ప్రధానమంత్రి గారు అయినా నరేంద్రమోదీ. యావత్ భరత దేశం గర్వించదగ్గ ఒక గొప్ప స్థాయిలో ఉన్నారంటే  అది నరేంద్ర మోడీ గారి అమ్మ ఆశీర్వచనాలే. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాగాని, ఎంత కోటీశ్వరుడయినా గాని అది అమ్మ ముందు తక్కువే.దేశానికి ప్రధాని అయినా గాని ఒక తల్లికి బిడ్డే కదా.

 

 

 

 

 

ఎంత ఐశ్వర్యం ఉన్న గాని, చేతిలో పదవి ఉన్నాగాని  నరేంద్రమోడీ గారికి  అమ్మంటే అపారమైన ప్రేమ. ప్రతి విషయాన్నీ అమ్మతో పంచుకుంటారు. ఎక్కడికన్నా వెళ్లేటపుడన్న, ఏదన్నా మంచి పని చేయాలనుకున్నప్పుడు గాని ముందుగా  తల్లి హీరాబెన్ ఆశీర్వచనాలు తీసుకోవడం మన మోడీ గారికి అలవాటు. 95 సంవత్సరాల మోడీ తల్లి గారు మనసు ఎంత గొప్పది అంటే.. దేశం మొత్తం కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అయితే మన పీఎం తల్లి గారు తను దాచుకున్న  25 వేల రూపాయిల సొమ్మును "పీఎం కేర్స్ ఫండ్ " కి విరాళంగా ఇచ్చారంటే ఆవిడ ఓదర్యానికి చేతులెత్తి దండం పెట్టవచ్చు.. అలాంటి ఒక గొప్ప తల్లి బిడ్డ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

 

 

 

 

 

ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడూ వెళ్లి తన తల్లిని చూసి వస్తారు. ఆమెతో కొంత సేపైనా గడపడం తనకు సంతోషాన్ని కల్గిస్తోందట. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడ తన కుటుంబం పట్ల తన బాధ్యతలను మాత్రం విస్మరించలేదని  మోడీ ఒకానొక సమయంలో చెప్పారు.వాద్ నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో టీ  అమ్మే స్థాయి నుండి దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి మన నరేంద్ర మోడీ. ఇంతా అత్యున్నత స్థానానికి రావడానికి తన తల్లి ఆశీర్వచనాలే కారణం అని నరేంద్ర మోడీ ఎప్పుడు గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఆయనకి అమ్మతో ఉన్న అనుభందం అలాంటిది మరి. ఎంత బిజీగా ఉన్నాగాని సమయం కుదిరినప్పుడల్లా అమ్మని చూడడానికి వెళ్తూ ఉంటారు. మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి  ప్రజలకు ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.అలాగే  పేద ప్రజానీకం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. దేశం గర్వించదగ్గ బిడ్డగా ఎదిగిపోయారు మన ప్రధాన మంత్రి.. 

 

   

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: