ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత  అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే  ఉద్దేశంతో పాలనా వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కి ఊహించని షాక్ తగిలింది. ఇక జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో అటు అమరావతి రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు టిడిపి పార్టీ సైతం తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అమరావతి రైతులు అందరికీ అండగా నిలిచింది.


ప్రస్తుతం ఎన్నో రోజులు అయిపోవడంతో ఈ వివాదం  కాస్త చల్లబడింది. అయితే ఇటీవలే వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు, సీఆర్డీఏ రద్దు  కు సంబంధించిన బిల్లు ఏపీ గవర్నర్ దగ్గరికి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ గవర్నర్ వికేంద్రీకరణ సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీనిపై టిడిపి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. దీనిపై గతంలో రాష్ట్ర విభజన సమయంలో అమలు చేసిన ఒక బ్రహ్మాస్త్రాన్ని టీడీపీ  ప్రయోగించింది  అన్నది ప్రస్తుతం అర్థమవుతుంది. టిడిపి కి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రాజీనామాలు చేసిన విధంగా ప్రస్తుతం కూడా అదే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


 అయితే రాజీనామాలు చేయడం ద్వారా టిడిపికి మరింత బలం తగ్గిపోయే అవకాశం ఉంది. మండలిలో వైసీపీ మెజారిటీ పెరిగిపోయి కనీసం టిడిపి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు రాజీనామాలు చేసి వాటిని మళ్లీ మండలి చైర్మన్ ద్వారా క్యాన్సల్  చేయించుకుంటే  మాత్రం ప్రజల్లో టిడిపి నాటకం ఆడుతోందని మరోసారి నిరూపితమై నమ్మకం పోతుంది, ప్రస్తుతం చంద్రబాబు సంధించిన అస్త్రం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుత సమయంలో మాత్రం అది కత్తి మీద సాములా మారింది అని అంటున్నారు విశ్లేషకులు. రాజీనామా చేస్తే అటు వైసిపికి మెజారిటీ పెరిగే అవకాశం ఉందని ఒకవేళ చేయకపోతే ప్రజల్లో.. చంద్రబాబుకు మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది చూడాలి మరి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: