గత ఏడాది ఉల్లి ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో సామాన్య ప్రజలు అందరూ బెంబేలెత్తి పోయిన విషయం తెలిసిందే. వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బ తినడంతో ఉల్లి దిగుబడి తగ్గి పోయి ఒక్కసారిగా మార్కెట్లో ఉల్లి కి డిమాండ్ పెరిగి పోవడంతో  ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. ఉల్లిని  కొనాలంటే ఆలోచించే పరిస్థితులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ప్రజలందరూ ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం ఎక్కువ ధర పెట్టినా మార్కెట్లో దొరికే పరిస్థితి లేకపోవడంతో... ఇక రోజువారి వంటకాలలో ఉల్లి  లేకుండానే సామాన్య ప్రజలు వంటలు వండుకున్నారు అనడంలో అతిశయోక్తిలేదు అప్పట్లో ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లి  అందించడంతో ప్రజలందరికీ కాస్త ఊరట లభించింది అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు మరో సారి ఉల్లి ధరలు అమాంతం పెరిగి పోతున్న విషయం తెలిసిందే.  దీంతో సామాన్య ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ఏడాది పెరిగిన ఉల్లి ధరలతో ఇబ్బందులు పడితే మళ్లీ ఉల్లి ధరలు పెరగడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నారు సామాన్య ప్రజలు. కేవలం ఉల్లి ధరలు మాత్రమే కాదు ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య సాధారణ కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఉల్లి ధరలు కూడా కొండెక్కడంతో  మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఉల్లి ధరలు పెరిగిన సమయంలో నగదు బంగారం కాకుండా ఉల్లి దొంగతనాలు జరగడం చూసాం.



 ఇప్పుడు మరోసారి దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉల్లి దొంగతనాలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధర  దాదాపుగా  వంద రూపాయలకు చేరింది. ఈ క్రమంలోనే ఇటీవలే మహారాష్ట్రలో ఏకంగా ఐదు వందల యాభై కిలోల ఉల్లి దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారిపోయింది. సంజయ్, పాపాత్  అనే ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: