తెలంగాణాలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయం కొనసాగుతుందని చెప్పొచ్చు.. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరో వైపు గ్రేటర్ ఎన్నికలు, ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ లో రాజకీయం రోజు రోజు కు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇప్పటికే  దుబ్బాక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయగా అక్కడ ప్రచార పర్వం ఇప్పటికే మొదలైపోయింది చెప్పొచ్చు. అన్ని పార్టీ లు తమ తమ ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోగా అభ్యర్థుల ఎన్నిక విషయంలో అన్ని పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేసింది.. అధికార పార్టీ కి ఈ ఎన్నికల పై పెద్దగా టెన్షన్ లేకపోయినా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య భీక పోరు జరగనున్నదన్నది వాస్తవం..

ఇటీవలే జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ మెజర్టీ తో గెలిచిన సంగతి తెలిసిందే.. తెలంగాణ గులాబీ పార్టీ పని అయిపోయిందన్న వారికి ఇదో పెద్ద దెబ్బ అని చెప్పాలి.. రానున్న దుబ్బాక, గ్రేటర్ , ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ఎన్నిక మంచి బలం అవుతుందని చెప్పనవసరం లేదు..  ఈ దెబ్బతో ఇన్నాళ్లు పార్టీ పై ఉన్న వ్యతిరేకత కాస్త బలపడే దిశగా వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..

ఇక ఇక్కడ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఇక్కడకి పంపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లలో ఐక్యత లేదు కానీ… దుబ్బాకలో మాత్రం ఎవరికి వారు కష్టపడి.. తమ ప్రతాపం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రనేతలంతా తలా ఓ మండలం బాధ్యత తీసుకోవడంతో.. ఆయా మండలాల్లో మెజార్టీ తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వారంతా.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష రేస్ నడుస్తోంది. ఈ రేసులో నెగ్గాలంటే… కొత్తగా తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ అయిన మాణిగం ఠాకూర్‌ని మెప్పించాలి. ఆయనను మెప్పించాలంటే.. పొగడ్తలతో కావడంలేదు. పనితీరుతోనే సాధ్యం. ఆ విషయం ఇప్పటికే సీనియర్లకు స్పష్టమయింది. అందుకే.. దుబ్బాకలో చెమటోడుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: