ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక మొన్నటి వరకు ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థుల భవితవ్యం ఏంటో ఇక మే 13వ తేదీన తేల్చేశారు తెలంగాణ ఓటర్లు  ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు జూన్ 4వ తేదీన విడుదల కాబోయే ఫలితాలలో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది  అయితే ఇక మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి విజయం ఎవరిది అనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. అటు కేసీఆర్ సొంత జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమించారు.


 ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇంకోవైపు బిఆర్ఎస్ పార్టీ కంచుకోటను కాపాడుకునేందుకు కేసిఆర్ కూడా ఇక మెదక్లో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోవైపు బిజెపి తమదే విజయం అంటూ ధీమాతో ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తేల్చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదయింది అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 మొత్తంగా చూసుకుంటే అటు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని నియోజకవర్గాలలో కలిపి 73.63% పోలింగ్ నమోదయింది. ఇక ఎక్కువగా నర్సాపూర్ నియోజకవర్గంలో  పోలింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే గజ్వేల్ లో  73.15% పోలింగ్ నమోదయింది. సిద్దిపేటలో కూడా 73.15% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. దుబ్బాకలో 80.22 శాతం మెదక్లో 79.61%, నర్సాపూర్లో 83.73%, పటాన్చెరులో 61%, సంగారెడ్డిలో 79.07% పోలింగ్ నమోదయింది. అయితే గత ఎలక్షన్స్ తో పోల్చి చూస్తే ఈసారి పోలింగ్ శాతం కాస్త ఎక్కువే ఉంది. దీంతో ఈసారి ఎవరు గెలిచినా భారీ మెజారిటీతో గెలుస్తారు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: