•రాష్ట్రమంతా వీచిన ఫ్యాన్ గాలి
- కీలకపాత్ర వాలంటీర్లే..
- జగనన్న గెలుపు పేదల బ్రతుకులో మార్పు.


ఏపీలో గత ఆరు నెలల నుంచి ఏర్పడినటువంటి ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల గొడవలు జరిగినా కానీ, పోలీసులు వారిని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ విధంగా రాష్ట్రమంతా 70శాతం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. దీంతో చాలామంది ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండు ప్రత్యర్థి పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ గెలిచేది ఎవరు.? ఓడేది ఎవరు అనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.


 ఈ తరుణంలో  రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళి  చూస్తే మాత్రం  గతంలో ఎన్నడూ లేనంతగా జరిగింది. ఈసారి మహిళలు,వృద్ధులు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇంతమంది పోలింగ్ కేంద్రాలకు రావడానికి ప్రధాన కారకులు  వాలంటీర్లు అని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నారు. వారు జగన్ ప్రభుత్వంలో ఎంతో లబ్ది పొందారు. ప్రజలకు ప్రతి పథకాన్ని ఇంటికే తీసుకువచ్చి అందించారు. ప్రతి గ్రామంలో ప్రజాలతో మమేకమై  వారి ఇంటిలో మనిషిగా మెదిలారు. అంతేకాదు ప్రస్తుత ఎలక్షన్స్ లో దాదాపుగా 60 నుంచి 70 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసి మరీ జగన్ కోసం ప్రచారం నిర్వహించారు.  ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వారు ప్రచారం చేశారు అంటే, తప్పనిసరిగా జగన్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది.

మళ్లీ ఉద్యోగంలో ఎక్కవచ్చు అనే ధీమాతోనే ఇలా చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. వీరంతా  50  ఇండ్లలో ఉండే ప్రజలను ఎంతో కొంత మోటివేట్ చేసి ఉంటారు. అంతేకాకుండా వైసిపి నుంచి వారికి ముందస్తుగానే సమాచారం అందిందట. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని ఓటేసేలా  మోటివేట్  చేయండని ముందుగానే సమాచారం అందించారట. ఆ విధంగానే మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు  పెద్ద మొత్తంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓట్లన్నీ ఎక్కువ శాతం జగన్ కి ప్లస్ గా మారే అవకాశం ఉందని ఇదంతా వాలంటీర్ల పనే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దీంతో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: