తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోకెల్లా  వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉద్యమాలకు ఊపిరి ఊదిన పోరాటాల గడ్డ వరంగల్. రాణి రుద్రమ పాలించిన ఈ వరంగల్ కిల్లా పై పై చేయి సాధించేది ఎవరు.. ఈ కిల్లాను పాలించేదెవరు అనే వివరాలు చూద్దాం. వరంగల్లో కాంగ్రెస్,బిజెపి, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇందులో కాంగ్రెస్ తరపున  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య మొదటిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఇక బిజెపి నుంచి మాజీ  వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు.  మరి అలాంటి వరంగల్ జిల్లాలో మొత్తం 18 లక్షల 24 వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 30 వేల మంది ఎక్కువగా ఉన్నారు.

 ఈ క్రమంలో ఇక్కడ మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. ఇలాంటి వరంగల్ జిల్లాలో  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పట్టు సాధించింది. 2019 ఎన్నికల్లో పసునూరి దయాకర్ బీఆర్ఎస్ తరఫున ఇక్కడి నుంచి గెలుపొందారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా ఒక స్థానంలో శ్రీహరి విజయం సాధించారు. రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన కూడా కాంగ్రెస్ తీర్థమే పుచ్చుకున్నారు.  దీంతో వరంగల్ అంతా కాంగ్రెస్ చేతిలోకి వచ్చేసింది. ఈ పార్లమెంట్ పరిధిలో  కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కూడా మహిళలే కావడంతో ప్రస్తుతం కడియం కావ్య కూడా మహిళ కావడంతో అక్కడ మహిళా ఓటర్లంతా  కావ్య కే సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

అంతేకాకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు ప్రయాణాల్లో మహిళలు ఎంతో ప్రాధాన్యత పొందుతున్నారు. అలాగే వరంగల్లో పురుషుల కంటే మహిళా ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని అంశాలను బట్టి చూస్తే మాత్రం అక్కడ కావ్య విజయం ఖరారు అయినట్టే కనిపిస్తోంది. అంతేకాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు 606100 ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 5, 02, 000 ఓట్లు పడ్డాయి. బిజెపికి ₹1,50,000 చిల్లర ఓట్లు పడ్డాయి. ఈ లెక్కన చూసుకున్నా గాని కాంగ్రెస్ కి ఈసారి ఎక్కువ ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఇంకాస్త ఓట్లు కాంగ్రెస్ కి ఫేవర్ గా వచ్చే అవకాశం ఉంది. అన్ని అంశాలు కావ్య వైపే మొగ్గుచూపడంతో ఆమె విజయం  తప్పక సాధిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: