నిజాంబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఈ విషయంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో నిజాంబాద్ పార్లమెంట్ స్థానం  దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే వందల సంఖ్యలో ఇక్కడి నుంచి పసుపు రైతులు నామినేషన్లు వేయడం.. ఇంకోవైపు అటు అప్పుడు సీఎంగా ఉన్న కెసిఆర్ కూతురు కవిత నిజాంబాద్ నుంచి పోటీ చేయడం సంచలనమైంది.


కవిత పసుపు బోర్డు తేవడంలో విఫలమైంది. ఇలాంటి సమయంలోనే అప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేసే నాయకుడు కావాలి అని నిజాంబాద్ రైతులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో జనం నాడిని పట్టుకున్న ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం తన వల్లే అవుతుంది అంటూ అందరిలో నమ్మకాన్ని కలిగించాడు. ఇక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో దాదాపు సక్సెస్ అయ్యాడు. దీంతో అప్పుడు సిట్టింగ్ ఎంపీగా  ఉన్న సీఎం కేసీఆర్ కూతురు కవితను సైతం ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేశాడు.



 ఇక ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరోసారి అరవింద్ జనం నాడిని పట్టుకున్నాడు అన్నది తెలుస్తోంది. ఒకప్పుడు పసుపు బోర్డు కోసం కొట్లాడిన రైతులు ఇక ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తున్నారు. బోధన్, మెట్పల్లిలో ఇలా నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 2004లోనే చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటుపరం చేయగా.. ఈ ఫ్యాక్టరీలు నష్టాల బాట పట్టడంతో 2014లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఫ్యాక్టరీలను మూసివేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ హామీనే మరిచిపోయారు. దీంతో ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించబోయే నాయకుడు ఎవరు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో.. అది నేనే అంటూ మరోసారి అందరిలో నమ్మకాన్ని కలిగించాడు ధర్మపురి అరవింద్. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాను అనే హామీతోనే  ప్రచారంలో ముందుకు సాగారు. పసుపు బోర్డు తీసుకురావడంలో  సక్సెస్ అయిన అరవింద్ ను ప్రజలు కూడా నమ్మారు. ఇంకోవైపు ఇక అరవింద్ దూకుడు స్వభావం   ఆయనకు బలమైన ప్రత్యర్థులు లేకపోవడం కూడా ఇక ఆయనకు గెలుపును మరింత దగ్గర చేశాయి. ఇక్కడ టిఆర్ఎస్ నుంచి బాజీ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేశారు అన్న విషయం తెలిసిందే. ఇలా జనం నాడిని అర్థం చేసుకొని ముందుకు సాగిన ధర్మపురి అరవింద్ మరోసారి ఎంపిక గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mp