గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో వచ్చిన వరదల దెబ్బకి ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా సాధారణ పరిస్థితుల్లో రాలేదు అని చెప్పాలి. చాలామంది తినడానికి తిండి లేక అప్పులు చేసుకుని తినే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వ సహాయం చేయాలని భావించిన సరే అంతగా ఆశించిన విధంగా పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఇప్పుడు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి హైదరాబాద్ కి సహాయం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కొంత మంది స్టార్ హీరోలు. ఇప్పుడు హైదరాబాదులో బస్తీ ప్రాంతాల్లో పర్యటించి వారికి ఆహారం ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటువ్యాధులు కూడా వస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని వైద్య సదుపాయాలు కూడా వారికి అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్ హీరోలు అందరూ సమావేశమై దీనికి సంబంధించి ఒక నిర్ణయం  తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ హీరోలు విరాళాలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల్లోకి వచ్చి కనీసం పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో స్టార్ హీరోలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే సమావేశం నిర్వహించి ఆ తర్వాత ముందడుగు పడే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇతర నటులు కూడా ఇప్పుడు హైదరాబాదులో పర్యటించి వాస్తవాలు తెలుసుకొని అక్కడి ప్రజలకు తమ వంతుగా సహాయం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలు అందరూ కూడా హైదరాబాద్ కి భారీగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: