ఏపీ బిజెపిలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొద్ది నెలల క్రితమే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు, గత అధ్యక్షులు కంటే భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. పార్టీలో ఎవరు క్రమశిక్షణతో మెలిగకపోయినా, వారిపై వేటు వేస్తూ, బిజెపి అంటే క్రమశిక్షణకు మారుపేరు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో ఎంతో మంది బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినా, ఇంత కఠినంగా ఎవరు వ్యవహరించలేదు. వీర్రాజు కంటే ముందు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కేవలం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చే వారు, సొంత పార్టీ నాయకులను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూసేవారు. 


వీర్రాజు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ, ఏపీ బిజెపి లో తానే సుప్రీమ్ అని, తన మాటకు గాని, అధిష్టానం పెద్దల అభిరుచికి అనుగుణంగా కానీ నడుచుకోక పోతే ఎంత వారి పైన వేటు వేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పూర్తిగా బీజేపీని ప్రక్షాళన చేశారు. చంద్రబాబు మనుషులుగా ముద్రపడిన నాయకులకు గట్టి మద్దతు ఇస్తూ , అటువంటి వారిలో కొంతమంది పై సస్పెన్షన్ వేటు వేయడంతో మిగతా నేతలంతా లైన్ లోకి వచ్చేసినట్టు గా కనిపిస్తున్నారు. 



ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మధ్యనే వీర్రాజు పెట్టిన నిబంధనపై పార్టీ నాయకులు తీవ్ర అసహనం కలుగుతుంది. మీడియాతో మాట్లాడే విషయంలో కానీ, డిబేట్ లో పాల్గొన్న అంశాలలో కానీ, ఎవరిపైన అయినా విమర్శలు చేయాలని, ముందుగా సదరు నాయకులు మాట్లాడే స్క్రిప్ట్ ను తనకు పంపించాలి అని, తన అనుమతితోనే మాట్లాడాలి అంటూ షరతులు పెట్టడంతో, బీజేపీలోని కొంతమంది కీలక నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ప్రస్తుతం చూస్తే బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. పార్టీ   బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా , మిగతా పార్టీల నుంచి నాయకుల చేరికలు లేవు. దీంతో పార్టీ ఏ విధంగా బలపడుతుంది  ? మరి ఏ విధంగా అధికారంలోకి వస్తుంది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కానీ ఇవేమి పట్టించుకోకుండా సోము వీర్రాజు వ్యవహరిస్తుండడం పార్టీలోని కొంతమంది నాయకులకు అసహనం కలిగిస్తుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: