ఇకపై భూముల రిజిస్ట్రేషన్‌కు పైరవీలు అవసరం ఉండదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తోందన్నారు.

తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్  ధరణి పోర్టర్‌ అధికారికంగా ప్రారంభించారు. ఇకపై అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరగనున్నాయి.  ప్రతీ ఇంటి జాగాను కూడా త్వరలోనే కొలుస్తామని ., పోర్టల్‌లో భూమి వివరాలు ఎక్కడ నుంచి అయినా చూసుకోవచ్చన్నారు కేసీఆర్.

పావుగంటలోనే రిజిస్ట్రేసన్ మ్యుటేషన్ జరుగుతుందన్నారు సీఎం కేసీఆర్.  భూ సమస్య రైతుకు తలనొప్పిగా మారిందన్నారు. ధరణి పూర్తి పారదర్శకంగా ఉందని., ఇక భూముల గోల్ మాల్ సంగతే ఉండదన్నారు ముఖ్యమంత్రి.  ఎండోమెంట్, వక్ఫ్ భూముల కబ్జాలు కూడా ఉండవన్నారు.

వచ్చే నెల 2 నుంచి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అమలులోకి వస్తుంది. మోసాలకు ఆస్కారమే లేకుండా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకూ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. కేవలం పది నిమిషాల్లోనే పట్టాదారు పాసు పుస్తకాలు..భూమి వివరాలు క్రయవిక్రయాలును తెలుసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే తాసిల్దార్‌ కార్యాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా పది లావాదేవీలను సక్సెస్‌గా నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు పూర్తికాగానే మ్యుటేషన్‌ పూర్తవుతుంది. తహసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, స్కానర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తానికి నవంబర్ 2వ తేదీ నుంచి ధరణి పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ పోర్టల్ ద్వారానే కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తోంది. అధికారుల చేతివాటం.. మధ్యవర్తుల ప్రమేయమే లేకుండా.. ఈజీగా స్లాట్ బుకింగ్, వెరిఫికేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకూ అంతా ఆన్ లైన్ లోనే జరుగడంతో పని సులువు కానుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: