తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు..నిన్న సాయంత్రం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లోని 5వ శక్తి పీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ పని తీరుపై విరుచుకు పడ్డారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ అసలైన హిందువు అంటూనే ఆలయాల అభివృద్ధిని పక్కన పెట్టేశాడు.. ఏ దేవాలయం కు వెళ్లిన వేల కోట్లు, 100 కోట్లు అంటాడు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టడు. ఏది పట్టీ పట్టనట్లు వ్యవహరించడం ఆయనకు ఈరోజు కొత్త కాదు..




తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్న దేవాలయాల పరిస్థితులను చూసి ప్రజలు అన్నీ పనులను చేస్తున్నారు... తప్ప కేసీఆర్ కానీ , అతని కుటుంబ సభ్యులు, నియోజక వర్గం వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాకపోవడం అవమాన కరం అంటూ సంజయ్ పేర్కొన్నారు. తుంగభద్ర పుష్కరాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు.
5వ శక్తి పీఠం పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.. మంత్రులతో కూడా చర్చలు జరపడానికి నిరాకంచిన సందర్బాలు లేకపోలేదు. ప్రజలను కూడా కనీసం పట్టించుకోలేదు అది తెలంగాణ సీఎం పని తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..




తెలంగాణ ముఖ్యమంత్రికి వేయి కోట్లకు వంద కోట్లకు తేడా లేకుండా పోయింది. తెలంగాణలోని దేవలయాలు మరుగున పడటానికి ముఖ్య కారకులు ఈ చేతకాని సీఎం. ఎప్పుడూ కుటుంబం బాగుండాలి.. కుటుంబం లో అందరూ పదవుల్లో ఉండాలి.. ఇంటి నిండా అష్ట ఐశ్వర్య లతో ఉండాలని అనుకుంటాడు. అది ఆయన నైజం.. ప్రజలు ఉన్నారా, పోయారు కూడా ఆయనకు అనవసరం.. అందుకు సాక్ష్యం ఇటీవల ముంచేసిన వరదలు..ప్రజలు ఉండటానికి నివాసం లేక సర్కార్ ను వేడుకున్నారు కానీ ఈయన కుర్చీ దిగలేదు. మీ సంతోషమే మీకు ముఖ్యం.. మీరు మీ కుటుంబం మీ పిల్లలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేమే అమ్మవారిని కోరుకుంటాము.. అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ నేతలను రెచ్చగొట్టడం తో పాటుగా దుమారం రేపుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: