ఏటీఎంకు మీరు రోజూ వెళ్తుంటారా? డబ్బులు డిపాజిట్ చేస్తుంటారా? అయితే ఈ విషయాన్ని మీరు తప్పక చూడాలి. ప్రైవేట్ బ్యాంకులు క్యాష్ డిపాజిట్‌కు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలను కూడా ప్రకటించింది. బ్యాంకులు పని చేయని వేళలు , బ్యాంకులకు సెలవులు ఉన్న సమయం లో క్యాష్ డిపాజిట్ మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే కన్వీనెన్స్ ఫీజు చెల్లించాలి అని చెప్పడం జరిగింది. మీరు కనుక ఎంత మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేసినా రూ. 50 చెల్లించాలి అని తెలిపారు.

అదే కనుక వర్కింగ్ డేస్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో ఈ ఛార్జీలు వర్తిస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. ఛార్జీలు నవంబర్ 1 నుండే  అమలులోకి వచ్చాయి. ఎవరికీ వర్తించవంటే...?  రూ.10,000 లోపు క్యాష్ డిపాజిట్ చేసేవారికి మాత్రమే ఈ ఛార్జీలు వర్తించవు. అదే మీరు ఒకే లావాదేవీలో లేదా పలు లావాదేవీల్లో నెలకు రూ. 10,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే మాత్రం కన్వీనెన్స్ ఫీజు రూ. 50 చెల్లించాలి. ఇది ఇలా ఉండగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ , జన్ ధన్ అకౌంట్లు ఉన్న వారి తో పాటు సీనియర్ సిటిజన్లకు , అంధులకు , విద్యార్థులకు ఈ ఛార్జీలు వర్తించవు.

ఇవి ఇలా ఉండగా వర్కింగ్ డేస్ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు, సెలవులు ఉన్న రోజుల్లో క్యాష్ డిపాజిట్ చేస్తే రూ.50 వసూలు చేస్తోంది యాక్సిస్ బ్యాంక్. ఇప్పటికే మెషీన్‌లో క్యాష్ డిపాజిట్ల పై కన్వీనెన్స్ ఫీజు వసూలు చేస్తున్నాయి.  ఆగస్ట్ 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: