కానీ జగన్ ఎం చేసినా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మెప్పించే విధంగా నే చేస్తారు.. దాంతో ఆ విషయంలో టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మలేదు.. ఇక రాష్ట్రంలో కుల రాజకీయాలు ఏ రేంజ్ లో జరుగుతాయో అందరికి తెలిసిందే.. ఈ రకపు రాజకీయాలను టీడీపీ బాగా ప్రోత్సహిస్తుంది. అందుకే కాబోలు ఈ ఎన్నికల్లో నమ్ముకున్న ఒక వర్గం వారు ఓట్లు వేయకపోవడంతో టీడీపీ ఓటమి పాలయ్యింది.. అయితే సామజిక వర్గాలకు చేయాల్సిన న్యాయం చేస్తే వారు మాత్రం టీడీపీ పట్ల ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతారు అన్నది అసలు ప్రశ్న.. ఇక వలసలు కూడా ఆ పార్టీ ని బాగా దెబ్బ తెస్తున్నాయి.. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఇతరపార్టీ లకు వెళ్లిపోగా మరికొంతమంది లైన్ లో ఉన్నారు.. ఈ నేపథ్యంలో కులరాజకీయాలు చేసే నేతలు ఇప్పుడు పార్టీ కి దూరమవడం టీడీపీ కి కొంత కష్టం గా మారింది..
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కుల రాజకీయ విధానాన్ని చంద్రబాబు అవలంభించారని గత రాజకీయాలను పరిశీలిస్తే తెలుస్తుంది.గత ప్రభుత్వ హాయంలో బాబు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే.. ఆయనపై టీడీపీలోని కాపు ప్రజా ప్రతినిధులతో విమర్శలు చేయించారు. ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిరసనలు చేస్తే.. ఆయనపై టీడీపీలోని మాదిగ సామాజికవర్గ ప్రజా ప్రతినిధులతో విమర్శలు చేయించారు. ఇలా బీసీ, ఎస్టీ, కాపు, రెడ్డి, కమ్మ, బ్రహ్మణ.. అన్ని సామాజికవర్గ సమస్యలు, విమర్శలు వచ్చినప్పుడు.. చంద్రబాబు తన పార్టీలోని అదే సామాజికవర్గ నేతలతో కౌంటర్లు, విమర్శలు చేయించిన విషయం సుస్పష్టం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి