తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ల ప్రచార పర్వం ఆఖరి రోజు కి చేరుకుంది. తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం తో  ఎదురులేని టీ ఆర్ ఎస్ కు  పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచు. గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తున్నా టీ ఆర్ ఎస్ పార్టీ ని బీజేపీ అలవోకగా నిలువరించింది. కేసీఆర్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ.. అయితే గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి..

అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారు.. ఇప్పటికైనా సర్దుకోకపోతే ఆంధ్ర లో టీడీపీ కి పట్టిన గతి పడుతుందని అన్నారు.. అయితే దుబ్బాక మిగిల్చిన ఫలితమే ఏమో కానీ గ్రేటర్ ఎన్నికలను మాత్రం కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబద్ ఎన్నికల్లో ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని.. కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నారు..

అందులో భాగంగానే నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు.. నేడు ప్రచారం లో ఆఖరి రోజు కావడంతో అందరు కేసీఆర్ ప్రసంగం పై ద్రుష్టి సారించారు. నేడు ఎల్బీ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌కు సీఎం కేసీఆర్ హాజ‌రుకానున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం ఓ లెక్క‌.. కేసీఆర్ స‌భ మ‌రో లెక్క అన్న‌ట్లుగా టీఆర్ఎస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.సభ ఏర్పాట్లలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ ప్రచార సభను జన సమీకరణ లోపం వల్ల టీఆర్‌ఎస్‌ నాయకత్వం చివరి నిమిషంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆయన హాజరయ్యే ప్రచార సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్యులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: