దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి వేలాదిగా రైతులు తరలివచ్చారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ పొలిమేరలకు చేరుకున్నారు. నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ట్రాక్టర్, ట్రాలీలలో నిత్యావసరాలు తెచ్చుకొని రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి తీవ్రం కావడంతో పంజాబ్ ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి అమితాషా సమావేశం కానున్నారు. ఎక్కువగా పంజాబ్ రైతునేతలే కావడంతో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.


రైతులకు సంఘీభావంగా 8 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఇప్పటికే హరియాణా వైపు వున్నా సంఘా, టేక్రి సరిహద్దు పాయింట్లను మూసివేశారు. తాజాగా మీరట్, ఫిరోజాపూర్, ఇటావా, నోయిడా నుంచి వేలాది మంది ట్రాక్టర్లలో రావడంతో నోయిడా లింకు రోడ్ చలియా సరిహద్దు పాయింట్లు మూసివేశారు.

చీలికలకు యత్నాలు
ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఓ దఫా అసంపూర్తిగా ముగియడంతో గురువారం మరోమారు చర్చలు జరగనున్నాయి. అందులో చర్చించే విషయమై 35 రైతు సంఘాల నేతలు సింఘా సరిహద్దు వద్ద సమావేశమై చర్చించారు. సాగు చట్టాలఫై డిమాండ్లు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరడంతో ఒక్కో పాయింట్ ఫై రైతులు చర్చించారు. మాలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తునందున 5న దేశవ్యాప్త పిలుపు ఇస్తున్నట్లు క్రాంతి కారి కిసాన్ యూనియన్ అధక్షుడి ప్రకటించారు. గురువారం ప్రభుత్వానికి చివరి అవకాశం అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: