విశాఖ నగర పరిధిలో నివాసముంటున్న సుమారు 25లక్షల మందికి ప్రతీరోజు వందల టన్నుల కొద్దీ కూరగాయలు వినియోగిస్తున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, దేవరపల్లి కాకుండావిజయనగరం జిల్లాల నుండే కాకుండా కూరగాయలు రైతు బజార్లకు వస్తాయి. సరఫరాకు తగ్గట్టుగానే వినియోగం ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఏలూరులో జరిగిన ఘటనతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించాయని సీసీఎంబీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. నీటి విషయంలో అపోహ పడాల్సిన అవసరం లేదని చెప్పాయి. వాయు కాలుష్యం ఏమీ లేదని ఎయిమ్స్, ఎన్ ఐ సీటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పాయి.
అందరూ ఊహించనట్టుగానే సీసం, నికెల్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్టు చెబుతూనే.. ఆహారం, కూరగాయల్లో పాదరసం, పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు పలు సంస్థలు ధృవీకరించాయి. వందలాది మంది అస్వస్థతకు గురికావడానికి ఇదే కారణమని పేర్కొన్నాయి. తినే అన్నంలో పాదరసం ఛాయలు కనిపిస్తున్నట్టు చెప్పడం మరింత ఆందోళన కలిగించే విషయం.
అధిక దిగుబడులు, చీడపీడలను పంటలను రక్షించుకునేందుకు కూరగాయల్లో ఎడాపెడా పురుగుమందులను పరిమితి లేకుండా వాడేస్తున్నారు. అంతేకాకుండా పండించడానికి వాడే నీటిని కూడా మురికి నీరు వాడి పండిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. దీని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోకుండా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఇప్పుడదే విషయం వింత రోగంలో భయటపడ్డాయి.
పురుగు మందులు వాడిన కూరగాయలు తినడం వల్ల ప్రజలు జీర్ణకోశ, అజీర్తి, కళ్లుతిరగడం, కడుపులో తిప్పడం లాంటి రుగ్మతలకు గురికావాల్సి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి లక్షణాలకు గురికావడానికి ఇలాంటి పరిస్థితే కారణమై ఉంటుందని నిపుణులు, పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి