ఈ మధ్యకాలంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తెరమీదికి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వాహనదారులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తెర మీదికి తెచ్చింది. బైక్ లేదా కారును కలిగివున్న వాహనదారులు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవడం ఎంతో మంచిది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వెహికల్ ఇన్సూరెన్స్ వంటి రెన్యువల్ డెడ్ లైన్ పొడగింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వెహికల్ డాక్యుమెంట్ లకు సంబంధించిన గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ముగియనుంది అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్  ఉంటే వెంటనే డిసెంబర్ 31 వరకు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ద్వారా ఈ రెండు ఎంతో సులభంగా జరిగిపోతుంది. ఇక ఈ డాక్యుమెంటరీ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించిన ఇక ఎక్స్ పైర్ అయిపోయిన డాక్యుమెంట్లతో ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే  మాత్రం భారీ జరిమానా  ఎదుర్కోవాల్సి వస్తుంది అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయల ఫైన్ పడుతుంది. అయితే వాహనదారులు అందరూ కూడా http://parivahan.gov.in వెబ్ సైట్ ద్వారా  ఆన్లైన్లోనే రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


ఈ సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్‌ ఆప్షన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్‌లోకి వెళ్లాలి. మీ రాష్ట్రం ఎంచుకోవాలి. ఇప్పుడు మీ రాష్ట్రం వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. డీఎల్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. తర్వాత దగ్గరిలోని ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లి మిగిలిన పని పూర్తి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: