ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించడానికి వివిధ మార్గాలను వెతుకుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కువమంది ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి చూపుతున్నారు.  ఇక ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మంచి రాబడి పొందేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో రకాల పోస్ట్ ఆఫీస్ స్కిమ్స్  ఇలాంటి వారి కోసం అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్న వారికి పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్  అందుబాటులో ఉంది.


 ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీమ్ లలో  మంత్లీ ఇన్కమ్ స్కీమ్  కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఈ స్కీమ్  లో చేరడం ద్వారా ప్రతి నెల డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ లాగా కూడా తెరిచేందుకు అవకాశం ఉంటుంది. కనీసం వెయ్యి రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం వచ్చే లాభం మాత్రం ఏమీ ఉండదు అని చెప్పాలి. ఇక ఈ స్కీమ్ లో  భాగంగా గరిష్టంగా 4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ తెరిస్తే తొమ్మిది లక్షలు వసూలు చేసుకోవడానికి వెసులు  బాటు ఉంటుంది.  అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని ఒకేసారి పెట్టాల్సి ఉంటుంది.



 ఇక ఆ తర్వాత ప్రతి నెల రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సీనియర్ సిటిజన్స్ కు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అనే చెప్పాలి. ఇక అయిదేళ్ల తర్వాత మీ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ప్రతినెల వడ్డీ వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి జాయింట్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ తెరిచారు అనుకోండి. మీరు ఈ అకౌంట్‌లో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే... అప్పుడు మీకు ఏడాదికి రూ.59,400 వేల వడ్డీ వస్తుంది. అంటే నెలకు దాదాపు రూ.5 వేలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: