ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మోడ్రన్ టాయిలెట్స్ కనిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మోడ్రన్ టాయిలెట్లు అన్నింటికీ ఫ్లష్ కోసం   రెండు బటన్లు ఉంటాయి.  ఫ్లష్ 1 చిన్నది ఉంటే ఒకటి పెద్దగా ఉంటుంది.  అయితే టాయిలెట్లలో  ఇలా ఫ్లష్ లకి  రెండు బటన్లు ఎందుకు ఉంటాయి అన్నది మాత్రం చాలామందికి తెలియదు.  ఏదో స్టైల్ కోసం అలా డిజైన్ చేసి ఉంటారు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ రెండు ఫ్లష్ బటన్స్  సంబంధించి వివరాలు మాత్రం చాలామందికి తెలియదు.  అయితే ఏదో డిజైన్ కోసం అలా రెండు బటన్స్ పెట్టారూ  అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. మోడ్రన్ టాయిలెట్లలో  రెండు బటన్లు ఏర్పాటు చేయడం వెనుక ఒక పెద్ద కారణమే ఉంది.



 అయితే టాయిలెట్ ఫ్లష్ రెండు బటన్స్  ఎందుకు అంటే.. సాధారణంగా పాత కాలం టాయిలెట్లలో ఒక బటన్ మాత్రమే ఉంటుంది. ప్రస్తుత కాలంలో వస్తున్న టాయిలెట్లలో మాత్రమే డబుల్ ఫ్లష్ బటన్  ఆప్షన్ ఉంటుంది. వీటిలో రెండు బటన్ ల  ఉపయోగం కూడా వేరుగా ఉంటుంది.   వీటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది.  అయితే 1976లో అమెరికా పారిశ్రామిక డిజైనర్ విక్టర్ పాప నెక్ అనే శాస్త్రవేత్త డిజైన్ ఫర్ ద రియల్ వరల్డ్  అనే పుస్తకం ద్వారా ఈ ఆలోచనకు బీజం వేశాడు. నీటిని పొదుపు చేసేందుకు ఆస్ట్రేలియాలో తొలిసారి ఇది  అమల్లోకి తెచ్చారు.



 అయితే మోడ్రన్ టాయిలెట్స్ లో ఉన్న రెండు బటన్లు చిన్న ఫ్లష్ నొక్కితే ఆరు నుంచి తొమ్మిది లీటర్ల నీరు విడుదలవుతాయి. అదే  చిన్న లివర్ బటన్ నొక్కితే కేవలం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు మాత్రమే విడుదలవుతాయి.  అయితే ఈ రెండూ ఎప్పుడూ ఉపయోగించాలి అంటే మూత్ర విసర్జన చేసినప్పుడు చిన్న బటన్..  మలవిసర్జన చేసినప్పుడు పెద్ద బటన్  ఉపయోగిస్తే  నీరు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుందనె  కారణంతోనే డిజైన్ తెరమీదికి తెచ్చారు. ఇలా సింగిల్ ఫ్లష్ ఉన్న టాయిలెట్ తో పోలిస్తే డబుల్ బటన్ ఫ్లష్ టాయిలెట్స్ ద్వారా  ఎక్కువగా నీరు ఆదా అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: