ఏపీ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగనోరు సీఎం అయిన క్షణం నుండి రాష్ట్రానికి ఏదో గ్రహణం పట్టినట్టుంది. ఊహించని దుర్ఘటనలతో రాష్ట్రములోని ప్రజలంతా అల్లాడిపోయారు. అయినా ఊహించని పరిణామాలు జరిగినప్పుడు జగనోరు మాత్రం ఏంచేయగలరు. కానీ తనకు చేతనైన సాయం మాత్రం బాధితులకు చేశాడనే చెప్పాలి. జగన్ ఏ ముహూర్తంలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో గానీ, అడుగడుగునా రాజకీయ సమస్యలు ఉక్కిరిబిక్కరి చేశాయి. వీటన్నింటికీ ప్రత్యక్షంగా జగనోరు కారణం కాకపోయినా, తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేదా పార్టీ కార్యకర్త చేసిన తప్పుకు చాలా సార్లు దోషిలా నిలబడాల్సి వచ్చింది.

ప్రతిపక్షం ఒకవైపు దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదలకుండా అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉన్నట్టుండి దేవుని ఆలయాలపై దాడులు జరగడం మొదలయ్యాయి. దీనితో రాష్ట్రంలో మత రాజకీయాలు రంగు పులుముకున్నాయి. జగనోరు క్రిస్టియన్ మతస్థుడు కావడం వలన ఆయనే ఇవన్నీ చేయిస్తున్నారని ప్రచారం ఎక్కువైంది. జగనోరు ఈ దేవాలయాల దాడులపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీ సిఐడి మరియు సిట్ వారికి కేసులను అప్పగించడం జరిగింది. ఈ దర్యాప్తులలో తెలిసిన సమాచారం ప్రకారం ఇది మతపూరితంగా జరింగింది కాదని, అంతే కాకుండా ప్రభుత్వానికి ఈ సంఘటనలకు ఎటువంటి సంబంధం లేదని కొన్ని కేసులు చేధించిన పోలీసులు చెప్పడం జరిగింది.

ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండడానికి ప్రభుత్వం వారు సదరు ఆలయ సిబ్బందికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యమైనది దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. అయితే కొన్ని దేవాలయాల్లో ఇది ఆచరణలోకి వచ్చినప్పటికీ, ఇంకా కొన్ని చోట్ల సీఎం సూచనలు బేఖాతరు చేస్తున్నారని తెలిసింది. ఇందుకు సాక్ష్యమే ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో ధర్మవరం పరిసర ప్రాంతాలలో ఒక ఆలయాన్ని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సమయంలో పూజారిని ఇలా అడిగారు, "ఏం స్వామీ ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు, ఎవడో వచ్చి ఏదో చేసి పోతాడు...తరువాత అది ప్రతిపక్షాలు అంతా కలిసి మా మీదనే వేస్తారు. దానిని కడుక్కోలేక మేము చావాలి అని ఘాటుగా ప్రశ్నించారు. దీనికి ఆ పూజారి బదులిస్తూ ఈ రోజు కమిటీ మెంబర్స్ వచ్చి చేయిస్తానన్నారు సార్. తరువాత అక్కడ నీటి సమస్య ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే నగర కమిషనర్ ని పిలిపించి దానిని పరిష్కరించమని చెప్పాడు. ఇదే విధంగా ప్రతి ఎమ్మెల్యే చొరవ తీసుకుని తనిఖీలు చేస్తే దేవాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉంటారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించవచ్చు. ఎంతైనా కేతిరెడ్డి సార్...యు ఆర్ గ్రేట్...!

మరింత సమాచారం తెలుసుకోండి: