ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సెగ మొదలైంది.. రాష్ట్రంలో జరగనున్న పంచాయితీ ఎన్నికల నామినేషన్లు దాదాపు మొదలు అయ్యాయి.అయితే గత ఎన్నికల కమిషనర్ లలా కాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాలలో పర్యటించడం జనాల్లో ఆసక్తిగా మారింది. గతంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల సమయంలో అత్యధిక ఏకగ్రీవాలు జరిగిన రాయలసీమ జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..ఇకపోతే అధికారపార్టీ పై బురద చల్లడానికి నిమ్మగడ్డ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని వైసీపీ అభిమానులు అంటున్నారు. 



అయితే, బలవంతపు ఏకగ్రీవ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాలల్లో పర్యటిస్తున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఇక ఇప్పటికే ఈ బలవంతపు ఏకగ్రీవాల కోసం సంజయ్ అనే ఐజీ స్థాయి అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ నిమిత్తం నియమించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన ఎవరూ కూడా జిల్లాల పర్యటనకు వెళ్ళిన సందర్భాలు అయితే లేవు. ఒకవేళ ఉన్నా అవి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అయితే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని గత ఏడాది ఫిర్యాదులు చేసినా పట్టించుకోని నిమ్మగడ్డ ఈసారి ముందస్తుగానే పర్యటనకు వెళుతుండటంతో రాజకీయ వర్గాల్లో రసవత్తరమైన చర్చలకు దారి తీస్తుంది.. 



ఇది ఇలా ఉండగా ఈ రోజు నామినేషన్ల పక్రియలో భాగంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో మాత్రం వాడి వేడిగా నామినేషన్లు వేస్తున్నారు. కాగా, కడపలో మాత్రం నామినేషన్లు ఆగిపోయాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 13 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిలిచాయి. ఇటీవల విభజన చేస్తూ 13 పంచాయతీలను ప్రభుత్వం పెంచింది. అయితే విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు విభజించిన 13 పంచాయితీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేతో 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ ఎన్నికలు మళ్లీ ఎప్పుడూ మొదలవుతాయన్నది ఆసక్తిగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: