మంగళవారం విజయవాడలో టీడీపీ నేత పట్టాభి కారుపై దాడి జరిగింది.. దాదాపు 15 మంది వరకూ కుర్రాళ్లు పట్టాభి కారును అడ్డుకుని ఆయనపైనా.. ఆయన కారు డ్రైవర్ పైనా దాడి చేశారు. ఆయన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటన నిన్నంతా సంచలనం సృష్టించింది. మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. అయితే ఈ దాడి చేయించింది ఎవరన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ వివరాలు సేకరించారు. దీని ఆధారంగా దర్యాప్తు సాగుతోంది.

అయితే ఈ దాడి చేయించింది చంద్రబాబే అయి ఉండొచ్చని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనలో టీడీపీ డ్రామా కనిపిస్తుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అంబేద్కర్‌ పేరుతో ఉన్న కాలనీలో దాడి జరిగిందని పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు.

ఒకవిధంగా చూస్తే.. అచ్చెన్నాయుడి ఘటన నుంచి డైవర్ట చేయడానికే టీడీపీ హడావుడి చేస్తున్నట్లు కనిపించిందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో మల్లెల బాజ్జి ఘటన కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో చంద్రబాబు అన్న మాటలు గుర్తు చేశారని.. ఉద్యమమంటే రెండు బస్సులైన తగలబడాలని చెప్పినట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఇలాంటి మనస్తత్వం వైయస్‌ జగన్‌కు ఏనాడు లేదన్నారు.

గడిచిన పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేదని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై చర్చ జరగాలన్నదే చంద్రబాబు మనస్తత్వమన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా   భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: