సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రుప్పలో రైతు వేదికను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి , అదనపు కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తరువాత మంచి‌నీటికి బాధ లేదు అని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ముక్కు పిండి కరెంట్ బిల్లులు వసూలు చేశారు అని ఆయన ఆరోపించారు. కానీ కరెంట్ మాత్రం ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. ఉచిత విద్యుత్ అని చెప్పిన కాంగ్రెస్ కరెంట్ లేకుండా చేసింది అని హరీష్ రావు మండిపడ్డారు. 

రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో అర్ధరాత్రి దొంగ కరెంటు ఇచ్చారు అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆనాడు రైతు చనిపోతే రూపాయి ఇవ్వలేదు అన్నారు హరీష్ రావు. కానీ రైతు చనిపోతే మేము ఐదు లక్షల బీమా మొత్తం‌ రైతు ఇంటికి పంపిస్తున్నాం అని హరీష్ వెల్లడించారు. రైతు బంధు కింద ఒక్క సంగారెడ్డికే 700 కోట్ల రూపాయలు ఇచ్చాం అని హరీష్ రావు వెల్లడించారు. టీఆర్ఎస్ ఏం చేసిందని కొంతమంది అవివేకంతో ప్రశ్నిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరో వచ్చి తెలంగాణ లో రైతులకు ఎం జరిగిందని అంటున్నారు అని మండిపడ్డారు. 

ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ పరోక్షంగా వైఎస్ షర్మిలకు చురకలంటించారు. తెలంగాణ పై కనీస పరిజ్ఞానం ఉందా ... ? అని నిలదీశారు. ఏపీలో రైతులకు మొత్తం కలిపి 12 , 500 ఇస్తున్నారు అని హరీష్ రావు అన్నారు. అదీ ఢిల్లీ ల్లి పైసలు కలిపి అంటూ ఆయన ఆరోపించారు. ఇక్కడ ఎకరానికి పది వేల చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు ఇస్తున్నాం అని హరీష్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: