సాధారణంగా అయితే చాలామందికి మొటిమల ద్వారా లేదా ఇతర కారణాల వల్ల కూడా ముఖంపై మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖం పై వచ్చిన మచ్చలను పోగొట్టుకునేందుకు ఎంతోమంది సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిసార్లు కొన్ని హానికరమయిన క్రీమ్స్ వాడుతూ ఉంటారు. దీంతో మొదటికే మోసం వస్తుంటుంది. మరి కొంతమంది వంటింటి చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మెడికల్ షాప్ లలో దొరికే క్రీమ్స్ కంటే వంటింటి చిట్కాలు ముఖంపై నల్లటి మచ్చలు పోగొట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అలాంటి ఒక వంటింటి చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇక ఆ తర్వాత నల్ల మచ్చలు ఉన్న చోట ఆ మిశ్రమాన్ని రాసుకుని కొద్దిసేపటి వరకు వేచి చూసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇక ఆ తర్వాత మచ్చలు ఉన్న చోట మాయిశ్చరైజర్ రాసుకోవాలి.. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేస్తే ముఖం పై ఉన్న మచ్చలు అన్నీ పూర్తిగా మాయం అవడమే కాదు అటు చర్మం కూడా ఎంతో కాంతివంతంగా మారుతుంది అని చెబుతున్నారు నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి