ఇలా.. ఇంత సెంటిమెంటును పండించిన చంద్రబాబు.. రేపు వచ్చే ఎన్నికల ఫలితంపై ఏం జరుగుతుందనే టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు.. ఏపీ ఎన్నికల ఫలితాలపై చాలా నిశితంగా పరిశీలన చేస్తున్నారు. అయి తే.. ఈ ఎన్నికల ఫలితాలు కనుక టీడీపీకి అనుకూలంగా లేక పోతే.. త్వరలోనే జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఆ పార్టీపై ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు. దీనికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా చంద్ర బాబు స్వయంగా రంగంలొకిదిగి ప్రచారం చేసినా.. కార్పొరేషన్లలో పట్టు సాధించలేక పోతే.. తిరుపతిని సునాయాశంగా వదులు కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. యువతను సమీకరించడంతోపాటు.. తిరుపతి ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా.. మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి ప్రభావం పడుతుంది. అదేసమయంలో అధికార వైసీపీ కూడా దూకుడు పెంచుతుంది. సో.. ఏమాత్రం స్థానికంలో తేడా వచ్చినా.. టీడీపీపై పెద్ద ఎత్తున ప్రభావం పడి.. తిరుపతి చేజారడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
అదే సమయంలో గెలుపు గుర్రం ఎక్కితే.. మాత్రం పార్టీ పుంజుకుంటుందని అనేవారు ఉన్నారు. అయినప్పటికీ.. తిరుపతి రాజకీయాలు డిఫరెంట్‌గా ఉన్నాయని.. ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉందని.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే.. టీడీపీకి కొంత బూమ్ అయితే వస్తుందని.. తిరుపతిలో ప్రచారానికి చంద్రబాబు వచ్చేందుకు ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. స్థానిక ఎన్నికల ఫలితం.. టీడీపీలో లైఫ్ అండ్ డెత్‌గా మారిపోవడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి