దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర‌వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమాను ఓ మై ఫ్రెండ్,  ఏంసీఎ సినిమాల ర‌ద్శ‌కుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాకుండా ఈ చిత్రానికి దిల్ రాజు మ‌రియు బాలీవుడ్ నిర్మాత బోణీక‌పూర్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ కు జోడీగా శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. అంజ‌లి, నివేధిత తామస్, అన‌న్య నాగోళ్ల‌, ప్ర‌కాశ్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌కీల్ సాబ్ ఎప్రిల్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే హైద‌రాబాద్ స‌హా అన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. కానీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపీ బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమ‌తులు ఇవ్వ‌లేదు. దాంతో అప్ప‌టికే వేల‌కు వేలు పెట్టి బెనిఫిట్ షో టికెట్ లు తీసుకున్న ఫ్యాన్స్ ప‌లు ప్రాంతాల్లో ఆందోళ‌న కు దిగారు. అంతే కాకుండా కొన్ని చోట్ల థియేర‌ట్ల పై రాళ్లు రువ్వారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. 

ఇక నిడ‌ద‌వోలు లో ఏకంగా ఎమ్మెల్యే ఇంటి ముందు ప‌వ‌న్ అభిమానులు ధ‌ర్నాకు దిగారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్ దేవేంద‌ర్ రెడ్డి చేసిన పోస్టో సంచ‌ల‌నం గా మారింది. వ‌కీల్ సాబ్ కాస్తా గాయ‌బ్ సాబ్ గా మిగిలిపోయాడ‌ట అంటూ ఆయ‌న చేసిన పోస్ట్ పై ప‌వ‌న్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పాపం… పావలా అభిమానులకు ఎంత కష్టం వచ్చిందో! అమ్మ పోపుల డబ్బాలో నుండి, నాన్న పర్స్ లోనుండి డబ్బులు ఎత్తుకెళ్లి మరీ ఎగేసుకుని సినిమాకి పోతే వకీల్ సాబ్ కాస్తా గాయబ్ సాబ్ గా మిగిలిపోయాడట…ఒరిజినల్ కంటే డూప్ సీన్లే బాగుంటే ఎలా ఆడించాలిరా ‘బాబో’య్ అని పెదవి విరుస్తున్నారట! సో సాడ్…అంటూ దేవేంద‌ర్ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ పై ప‌వ‌న్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఓ హోదాలో ఉన్న మీరు ఇలా దిగ‌జారి వ్య‌క్తిగతంగా విమ‌ర్ష‌లు చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఆడ‌వాళ్ల‌పై గొప్ప సినిమా తీస్తే అభినందించ‌కుండా ఇలా మాట్లాడుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: