1972వ సంవత్సరంలో కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్శిటీ నుంచి మెడిసిన్ పట్టా అందుకున్నారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడే రాజకీయాల వైపు ఆసక్తి చూపించిన రాజశేఖర్ రెడ్డి.. మహాదేవప్ప రాంపూరే మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నపుడు కళాశాల విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. గుల్బర్గాలో చదువుతున్నప్పటి నుంచీ ఆప్తమిత్రుడిగా కె.వి.పి రామచంద్రరావు ఉన్నారు. ఇక తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుంచి హౌస్ సర్జన్ పట్టా అందుకున్నారు. అక్కడ కూడా హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా నాయకత్వం వహించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొద్ది రోజులు జమ్మల మడుగులో.. తాను జన్మించిన కాంప్ బెల్ ఆస్పత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు. ఇక 1973వ సంవుత్సరంలో పులివెందులలో తన తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన 70పడకల ఆస్పత్రిలో డాక్టర్ గా సేవలు అందించారు. ఆ ఆస్పత్రి ఇప్పటికీ రోగులకు సేవలు అందిస్తుండటం విశేషం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం వైద్య సేవలు మాత్రమే కాదు.. విద్యను కూడా అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో విజ్ఞాన వెలుగులు నింపుతోంది. పులివెందులలో పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఎంతో మంది అక్కడ చదువుకుంటూ ఉన్నతంగా ఎదిగారు. ఆ తర్వాత ఆ విద్యాసంస్థలను లయోలా సంస్థల చేతుల్లో పెట్టారు. ఇక పులివెందులకు సమీపంలో.. సింహాద్రిపురంలో ఉన్న కళాశాల మాత్రం ఇప్పటికీ వైఎస్ఆర్ కుటుంబమే నిర్వహిస్తూ ఉండటం విశేషం.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అందరికీ ఆదర్శం. ఆయన సతీమణి విజయలక్ష్మి. కుమారుడు జగన్.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ తండ్రికి తగ్గ కొడుకుగా పాలన అందిస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజా నాయకుడిగా వెలుగొందుతున్నారు. ఇక కూతురు షర్మిళ జగన్ ముఖ్యమంత్రి కావడంలో తన పాత్ర చాలా ఉంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ నేతలు పక్కదారి పట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీని స్థాపించి రాజన్న రాజ్యం రావాలని కృషి చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి