వైద్య‌రంగంలోనే మ‌ళ్లీ ఓ అద్భుతం జ‌రిగింది. సాధార‌ణంగా రోగుల‌కు స‌ర్జ‌రీలు చేస్తున్న క్ర‌మంలో వారికి అన‌స్తీషియా ఇస్తారు. కానీ మెల‌కువ‌గా ఉన్న ఓ మ‌హిళ‌కు బ్రెయిన్ స‌ర్జ‌రీ చేశారు. ఇటీవ‌ల బ్రెయిన్‌లో క‌ణ‌తితో బాధ‌ప‌డుతున్న ఓ 24 ఏళ్ల మ‌హిళ‌కు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ చేశారు. స‌ర్జ‌రీ చేస్తున్న క్ర‌మంలో ఆమె మెలుకువ‌గానే ఉంది. శ‌స్త్ర‌చికిత్స ద్వారా మెద‌డులోని క‌ణ‌తిని తొల‌గిస్తున్న క్ర‌మంలో ఆమె హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణ చేశారు. అంతే కాకుండా త‌ప్పు ప‌ల‌క‌డంతో ఆప‌రేషన్ చేస్తున్న వైద్యుడు ఒకరు ఆమెకు స‌హ‌క‌రించాడు కూడా. క‌ణ‌తి ఉన్న ప్రాంతంలో మాత్ర‌మే మ‌త్తు ఇచ్చి ఆప‌రేష‌న్ చేసిన‌ట్టు ఈ విధానాన్ని `క్రేనియోట‌మీ` అంటార‌ని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.


   గత 20 ఏళ్లలో ఎయిమ్స్ వైద్యులు క్రేనియోటమీ విధానంలో 500పై చిలుకు ఈ విధంగా శస్త్రచికిత్స చేసినట్టు అధికార వర్గాలు మీడియాకు వివ‌రించాయి. డిసెంబరు 2018లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రిలో కూడా ఇదే విధానంలో ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. గ‌తంలో బెంగ‌ళూరులో ఇలానే గిటార్ వాయిస్తుండగా ఓ వ్యక్తికి  వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసి విజ‌య‌వంతం అయ్యారు.

    ఇదే విధంగా ఓ మ‌హిళ‌కు కూడా మెదడుకు ఎడమ వైపున ఉన్న కణతిని శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగలేదు అన్న‌ట్టు ఆ మ‌హిళా ఆప‌రేష‌న్ థియేట‌ర్ నుంచి తల అటూ ఇటూ ఊపుతూ  బయటకొచ్చారు. ఆప‌రేష‌న్ జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బందిలో ఒకరు ఈ దృశ్యాలను ఫోన్‌‌లో రికార్డు చేశారు. దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ విడియో వైర‌ల్ అయింది.

  ఆప‌రేష‌న్ అనంత‌రం ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు డాక్టర్ దీపక్ గుప్తా మీడియాతో మా
ట్లాడారు. 24 ఏళ్లున్న‌ మహిళకు మెదడులో కణతి ఏర్పడిందని, శస్త్రచికిత్స ద్వారా ఆ క‌ణ‌తిని తొల‌గించామ‌ని తెలిపారు. మూడు గంటల స‌మ‌యం పాటు జరిగిన సుదీర్ఘ ఈ ఆపరేషన్‌‌లో మహిళ మెలకువతోనే ఉందని ఆయ‌న తెలిపారు. ఆమె తలపై మాడు భాగంలోనే అనెస్తీషియాను ఇచ్చి, నొప్పి నివారణ మందు ఇచ్చామన్నారు. ఈ ఆప‌రేష‌న్ విజయవంతమయ్యిందని, ప్రస్తుతం ఆ మ‌హిళ పర్యవేక్షణలో ఉంద‌ని  శ‌నివారం డిశ్చార్జ్ చేయనున్నట్టు డాక్టర్ దీపక్ విరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: